జబర్దస్త్ లో అదిరే అభి టీంలో కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత తన పంచులతో పాపులారిటీ తెచ్చుకున్న హైపర్ ఆది జబర్దస్త్ లోనే కాదు సినిమాల్లో కూడా నటిస్తున్నాడు. స్మాల్ స్కీన్ పై తనకు వచ్చిన క్రేజ్ ను సినిమాల్లో కొనసాగించేలా ఆది ప్రయత్నాలు సాగుతున్నాయి. లేటెస్ట్ గా వచ్చిన వెంకీమామ సినిమాలో కూడా హైపర్ ఆది నాగ చైతన్య పక్కన స్నేహితుడి పాత్రలో నటించాడు. అక్కడక్కడ తన పంచులతో అలరించినా సరే ఆది యాక్టింగ్ టాలెంట్ మాత్రం మెప్పించట్లేదని చెప్పొచ్చు.

 

మిస్టర్ మజ్ ను లో కూడా ఆది నటించాడు. వెంకీమామ సినిమాలో కూడా ఆదికి మంచి రోల్ దొరికింది. అయితే ఆది పంచుల వరకు బాగానే అనిపించినా సిల్వర్ స్క్రీన్ పై తన నటన మాత్రం ఏదో కావాలని చేసినట్టు ఉంది తప్ప సహజంగా లేదు. స్కిట్టుల్లో పంచులేసినట్టు కాదు నటన అంటే ఆది ఈ విషయంలో దృష్టి పెట్టాలని ఏదంటే అతనికి అవకాశాలు రావని అంటున్నారు.

 

ఆది లానే జబర్దస్త్ లో స్టార్ కమెడియన్ అయిన చమ్మక్ చంద్ర కూడా సినిమాల్లో నటిస్తున్నాడు. వెంకీమామలో నూకరాజు పాత్రలో చమ్మక్ చంద్ర మెప్పించాడు. ఆదితో పోలిస్తే చమ్మక్ చంద్ర నటన బాగుంది. స్మాల్ స్క్రీన్ లో పచులతో అలరించే ఆది సిల్వర్ స్క్రీన్ పై మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవడం లేదని అతని ఫాలోవర్స్ అంటున్నారు. తను చేసే 10 నిమిషాల స్కిట్ లో ఒక దాని తర్వాత మరొక పంచ్ వేసి కడుపుబ్బా నవ్వించే ఆది వెండితెర మీద ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది.   

 

ఆది తప్పకుండా ఈ విషయంపై దృష్టి పెడితే మాత్రం అక్కడ కూడా మంచి అవకాశాలు వస్తాయి. జబర్దస్త్ కమెడియన్స్ అంటా వరుసగా సినిమాల్లో నటిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: