ఆది.. అంటే పెద్దగా ఎవరూ గుర్తుపట్టరు.. ఆది అంటారు.. అదే హైపర్ ఆది అని చూడండి.. గుర్తుపట్టని వారు ఉండరు. అంతగా పాపులర్ అయ్యాడు హైపర్ ఆది. జబర్థస్త్ స్కిట్టు హైపర్ ఆది జీవితాన్నే మార్చేశాయి. స్కిట్లకు స్క్రిప్టు రైటర్ గా వచ్చినవాడు.. ఆ తర్వాత తన టాలెంట్ తో స్కిట్లతో గుర్తింపు పొందాడు. ఆ తర్వాత ఏకంగా టీమ్ లీడర్ అయ్యాడు. అంతేనా.. అటు సినిమాల్లోనూ స్థానం సంపాదించుకున్నాడు. ఇప్పుడు సినీరచయిత అవతారం కూడా ఎత్తబోతున్నాడు.

 

అయితే బీటెక్ చదివి సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకుంటున్న హైపర్ ఆది జీవితాన్ని ఓ వీడియో మలుపు తిప్పింది. ఈ స్థాయికి తెచ్చింది. అదేలాగో ఆయన మాటల్లోనే విందాం. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

 

బీటెక్‌ చదివేటప్పుడు దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ ప్రసంగం, అత్తారింటికి దారేది సినిమాలోని ఓ సీన్‌కి స్పూఫ్‌ చేశా. ఆ వీడియోలను లక్షలమంది చూశారు. ఆ వీడియోని ‘అదిరే అభి’ అన్న చూసి ఆ వీడియోకిందనే మెసేజ్‌ పెట్టారు. మెసేజ్‌ చూశాక ఫోన్‌ నంబరు తీసుకుని అన్నపూర్ణ స్టూడియోకెళ్లి కలిశా. ‘నాకు స్క్రిప్టు రైటర్‌ కావాల’న్నాడు. స్క్రిప్టు రాయటం రాదన్నాను. తర్వాత ఎలాగైనా ఇటువైపే రావాలని నిర్ణయించుకుని.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేశా.

 

ఏడాది ప్రయత్నించి తాడోపేడో తేల్చుకోవాలనుకున్నా. ‘ఒక్క అవకాశం ఇవ్వండన్నా’ అని అదిరే అభి అన్నకు రోజూ మెసేజ్‌లు పెట్టేవాణ్ని. 2014లో ఓ రోజు ‘సరే వచ్చేయి స్టూడియోకి’ అన్నారు. అదే.. కథానాయకుడు సునీల్‌ను రిక్షాలో లాగటం. ఆ తర్వాత స్కిట్‌లో వెనకాల కనపడేవాణ్ని. తర్వాత డైలాగు ఇచ్చారు.. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో మీకు అందరికీ తెలిసిందే అంటూ తన అనుభవం పంచుకున్నాడు హైపర్ ఆది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: