చిరంజీవి రాజకీయాల నుండి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో నిరూపిస్తున్నాడు. దీంతో నెక్స్ట్ సినిమా కొరటాలతో చేయబోయే సినిమాతో ఎలాగైనా హ్యాట్రిక్ హిట్ సూపర్ హిట్ కొట్టడానికి చిరంజీవి స్టోరీ విషయంలో ఇంకా అనేక విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో స్టోరీ కి తగ్గ విధంగా తన బాడీని కూడా ఆరు పదుల వయసులో తగ్గించుకుంటూ సినిమాకి రెడీ అవుతున్నారు. ఇదిలా ఉండగా సినిమా ఇంకా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వక ముందే ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు మెగా అభిమానులో అంచనాలు పెంచేస్తున్నాయి.

 

విషయంలోకి వస్తే ఈ సినిమాలో చిరంజీవి తో పాటుగా హీరోయిన్ గా చెన్నై బ్యూటీ త్రిష ఎంపికైనట్లు ఇదే విషయాన్ని సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఓ యాక్టర్ సోషల్ మీడియాలో కామెంట్ చేయడంతో ఆ పోస్ట్ కి త్రిష స్పందించడంతో చిరు సినిమాలో హీరోయిన్ త్రిష కి బెర్త్ కన్ఫర్మ్ అయినట్లు సోషల్ మీడియాలో వార్తలు బలంగా వినబడుతున్నాయి. దీంతో ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చిరంజీవి హ్యాట్రిక్ విజయం వచ్చే ఏడాది 2020 లో గ్యారెంటీ అని మెగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

 

దాదాపు 13 సంవత్సరాల తర్వాత చిరంజీవి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వక ముందు త్రిష మరియు చిరంజీవి కలిసి స్టాలిన్ అనే సినిమా చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్లీ పదమూడు సంవత్సరాల కి ఇద్దరు కలిసి నటిస్తున్న నేపథ్యంలో అది కూడా కొరటాల శివ దర్శకత్వం కావడంతో ఈ సినిమా గ్యారెంటీ సూపర్ హిట్ అవుతుందని ముఖ్యంగా ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న నేపథ్యంలో గ్యారెంటీగా సూపర్ హిట్ అవుతుందని మెగా అభిమానులు ధీమాగా ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: