లవ్ స్టోరీ మొదలయ్యేది హీరో సైడ్ నుండి.. అందమైన హీరోయిన్ ను చూడటం ఆమెను ఇష్టపడటం.. ఆమె ప్రేమ పొందడానికి రకరకాల ప్రయత్నాలు చేయడం ఇది రెగ్యులర్ సినిమాల్లో చూసేదే.. కాని స్టార్ సినిమాల్లో ఈ లవ్ స్టోరీని షార్ట్ గా చేసి హీరో అడగడం ఏదో ఒకటి రెండు మంచి పనులకో లేదా డైలాగ్స్ కో హీరోయిన్ ఫ్లాట్ అవడం జరుగుతుంది. అయితే సూపర్ స్టార్ మహేష్ మాత్రం సీన్ రివర్ లో హీరోయిన్ ను వెంట పడేలా చేసుకుంటున్నాడు. 

 

మహేష్ బాబు లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో రష్మిక మహేష్ ను ప్రేమిస్తుందట. దీనికి సంబందించిన సాంగ్ పోస్టర్ వదిలారు. మాములుగా హీరోయిన్ కు ప్రపోజ్ చేద్దామని హీరో చేతిలో రెడ్ రోజ్ ఉంటుంది కాని సరిలేరు నీకెవ్వరు పోస్టర్ లో మాత్రం రివర్స్ గా రష్మిక చేతులో రోజ్ ఫ్లవర్ ఉంది. ఆమె మహేష్ వంక ప్రేమగా చూస్తుంది.

 

మహేష్ బాబు లాంటి అందగాడి వెంట పడటం తప్పేం లేదు కాని మాములుగా హీరోయిన్స్ వెంట హీరోలు పడాల్సింది. కాని మహేష్ సినిమాలో మాత్రం సీన్ రివర్స్ చేశారని అంటున్నారు. సరిలేరు నీకెవ్వరు సినిమా 2020 జనవరి 11న రిలీజ్ ఫైనల్ చేశారు. ఈమధ్య రిలీజైన సినిమా టీజర్ అంచనాలు పెంచగా రిలీజైన రెండు సాంగ్స్ మైండ్ బ్లాంక్, సూర్యుడివో చంద్రుడివో సాంగ్స్ అలరిస్తున్నాయి.

 

ఈ సినిమాలో రష్మిక నటించడం అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు. సినిమాలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణగా కనిపిస్తున్నాడు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్నారు. భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్లందుకున్న మహేష్ సరిలేరు నీకెవ్వరుతో హ్యాట్రిక్ పై గురి పెట్టాడు.      
 

మరింత సమాచారం తెలుసుకోండి: