తెలుగు సినీ ప్రపంచంలో రానా దగ్గుబాటి తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. ప్రముఖ నిర్మాత రామానాయుడు మనవడు గా సుపరిచితుడైన రానా తెలుగులో లీడర్ సినిమాతో తెరంగ్రేటం చేసాడు. ఒక పెద్ద నిర్మాణ సంస్థ నుంచి వచ్చిన ఈ హీరోకి అనుకున్న స్థాయిలో సినిమాలు చేయలేకపోయాడు. కానీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో ప్రభాస్ కి విలన్ గా నటించిన అద్భుతమైన నటనతో అందరి మన్ననలు పొందాడు.

 

హీరో బాలీవుడ్ లో కూడా ఇతనికి మంచి ఫాలోయింగ్ ఉంది. అక్కడ దమ్ మారో దమ్ సినిమాతో రంగ ప్రవేశం చేశాడు. అలాగే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ తో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నాడు. ఈ హీరో చొరవతోనే బాహుబలి ని కరణ్ జోహార్ ద్వారా రిలీజ్ చేయించి ఎంత పెద్ద ఘనవిజయాన్ని అందించాడు.

 

 రానాతో <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=KAJAL AGGARWAL' target='_blank' title='కాజల్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>కాజల్</a> అగర్వాల్.. Photo: Instagram.com/kajalaggarwalofficial

 

 అలాగే కాజల్ అగర్వాల్ ఈ అమ్మడు గురించి చెప్పవలసిన అవసరం లేదు. ఎంతో ముద్దుగా ఉండే ఈ ముద్దుగుమ్మ తన అందంతో కుర్రకారు కట్టిపడేసిన రోజులు చాలానే ఉన్నాయి. ఈ అమ్మడు రానాతో కలిసి నేనే రాజు నేనే మంత్రి సినిమా లో కలిసి నటించింది. ఆ సినిమాలో వీరిద్దరి జోడి చూడముచ్చటగా ఉన్నది. కెరియర్ మొదలై ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతున్నా కానీ ఆ ఆనందంలో ఏమాత్రం మార్పులు రాకపోవడం చర్చనీయాంశం.

 

నిన్న రానా దగ్గుబాటి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక ఫోటో పోస్ట్ చేసింది కాజల్ అగర్వాల్. యెల్లో కలర్ డ్రెస్ లో ధగధగా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్. కానీ ఇద్దరికీ పెళ్లి కాకపోవడంతో వీరి గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఈ అమ్మడు ఈ మధ్య సోషల్ మీడియాలో ఘాటయిన ఫోటో లు పెడుతూ అందరి ఆకర్షణన చేస్తూ అందరి చూపుల్ని తనవైపు తిప్పుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: