సంక్రాంతి సీజన్ లో రెండు సినిమాల మధ్య కీలక పోటీ కొనసాగుతోంది. ప్రచారంలో.. రిలీజ్ పరంగా ఠఫ్ కాంపిటీషన్ కనిపిస్తోంది. ఓ వైపు సరిలేరు నీకెవ్వరు.. మరో వైపు  అల వైకుంఠపురము లో బరిలోకి దూకేందుకు సిద్ధంగా ఉన్నాయి.  ఈ సినిమా లపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.సినిమా ల విషయంలో హీరోలు ఎవరు వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. బన్నీ త్రివిక్రమ్ మీదున్న నమ్మకంతో బరిలోకి దిగుతుంటే.

మహేష్ ఫ్యామిలీ ఆడియన్స్ టార్గెట్ చేసి మెప్పించాడనికి రెడీ అవుతున్నాడు. బన్నీ సినిమాను అల్లు అరవింద్ నిర్మిస్తుండగా, మహేష్ సినిమా కు దిల్ రాజు నిర్మాత . ఇక ఈ రెండు సినిమాలు ఈవిషయం లోను వెనక్కి తగ్గడం లేదు. పాటల్లో , పోస్టర్లో, ప్రమోషన్స్ లో పోటాపోటీగా దూసుకుపోతున్నాయి. అయితే  సినిమాల రిలీజ్ డేట్ లో మాత్రం  కాంప్రమైజ్ కు వచ్చారు. బ‌న్నీతో వార్‌కు మహేష్ దాదాపు ఫుల్‌స్టాఫ్ పెట్టేశాడు.  మొదట్లో రెండు సినిమాలను ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకువద్దామని భావించారు.

 

కానీ థియటర్స్ కొరత వచ్చే అవకాశం ఉంది. పైగా ఓపినింగ్స్ పై ఎఫెక్ట్ ఎక్కువగా పడుతుంది. దాంతో నిర్మాతల మండలి కూర్చొని మాట్లాడుకొని సామరస్యంగా సమస్యను పరిష్కరించారు. దాంతో మహేష్ కాస్త వెనక్కి తగ్గాడు. తాజాగా స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్ర రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 11న విడుదల కానుందని పోస్టర్‌లో తెలిపారు. ఆ రోజు బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురవడం ఖాయమని అభిమానులు చెబుతున్నారు. ఇక బన్నీ సినిమా 12న విడుదల కానుంది.

 

ఇదిలా ఉంటే ఇద్దరు హీరోల ఫ్యాన్స్ మధ్య మాత్రం వార్ ఒక రేంజులో నడుస్తుంది. సోషల్ మీడియా వేదికగా ఒకరి పై ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. ఇక సరిలేరు సినిమా నుంచి ప్రతి సోమవారం సాంగ్ విడుదల చేస్తుండగా, ఈ సోమవారం హీ ఈజ్ సో క్యూట్ అనే సాంగ్ విడుదల కానుంది. ఈ సాంగ్‌కి సంబంధించి రష్మిక టిక్ టాక్ వీడియో చేసిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ సినిమా హిట్ అవుతుందో ఏ సినిమా ఫట్ అవుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: