తెలుగు సాహితీవేత్త ప్రముఖ నటుడు రచయిత బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గొల్లపూడి మారుతీరావు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా  మారుతీ రావు మృతితో ఒక్కసారిగా తెలుగు చిత్రపరిశ్రమ మొత్తం ముగాపోయింది. కళామతల్లికి ఎన్నో ఏళ్లుగా సేవలు అందించిన గొప్ప వ్యక్తి  గొల్లపూడి మారుతీరావు మరణించడంతో ఒక్కసారిగా తెలుగు చిత్ర పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. కాగా గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు గొల్లపూడి మారుతీరావు. అయితే విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులు  రావడం లేట్ అవడం తో ఈరోజు గొల్లపూడి అంత్యక్రియలు జరుగుతున్నాయి.  గొల్లపూడి మారుతీరావు అంతిమ  యాత్ర మొదలైంది. చెన్నైలోని టీ నగర్ లో గల గొల్లపూడి మారుతీరావు నివాసం నుండే  ఆయన అంతిమయాత్ర మొదలైంది. 

 

 

 అక్కడినుంచి కన్నమ్మపేట  స్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగనుంది. కన్నంపేట స్మశాన వాటికలో  గొల్లపూడి మారుతీరావు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. కాగా గొల్లపూడి అంతిమ సంస్కారాలు ఆయన పెద్ద కుమారుడు సుబ్బారావు నిర్వహించనున్నారు. అయితే చెన్నైలోని ఆయన నివాసంలో గొల్లపూడి భౌతికకాయానికి సినీ ప్రముఖులు అభిమానుల నివాళులు అర్పించారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సహా ప్రముఖ నిర్మాత కాట్రగడ్డ మురారి తదితరులు అంజలి ఘటించారు. గొల్లపూడి మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపిన వారు గొల్లపూడి కుటుంబసభ్యులను పరామర్శించారు. సినీ పరిశ్రమలో తమకు గొల్లపూడి తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

 

 

 కాగా  గొల్లపూడి మారుతీరావు మొదట తెలుగు చిత్ర పరిశ్రమకు ఒక రచయితగా తన ప్రస్థానం మొదలుపెట్టి ఎన్నో అవార్డులు సైతం అందుకున్నారు. ఇక ఆ తర్వాత గొల్లపూడి మారుతీరావు కథలు రాయడం నుంచి నటుడిగా మారి పోయారు. ఆయన ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా... కమెడియన్ గా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గర అయిపోయారు గొల్లపూడి మారుతీరావు. అయితే గొల్లపూడి మారుతి రావు నేటి తరం ప్రేక్షకులకు కూడా కొసమెరుపు. ఎన్నో ఏళ్ల మంచి తెలుగు కళామతల్లికి ఎన్నో రకాలుగా సేవలందించిన గొల్లపూడి మారుతీరావు... తెలుగు చిత్ర పరిశ్రమకు దూరమవ్వడం నిజంగా ఒక తీరని లోటు.

మరింత సమాచారం తెలుసుకోండి: