విక్టరీ వెంకటేష్‌ అక్కినేని నాగ చైతన్య హీరోలుగా తెరకెక్కిన కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వెంకీమామ. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డివైడ్‌ టాక్‌ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం షాకిస్తోంది. చాలా రోజుల తరువాత వచ్చిన కామెడీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ కావటంతో ఆడియన్స్‌ వెంకీమామకు అట్రాక్ట్ అవుతున్నారు. రియల్‌ లైఫ్‌ మామా అల్లుళ్లు వెంకీ, చైతూలు మొదటిసారిగా రీల్‌ లైఫ్‌లోనూ మామా అల్లుళ్లుగా నటించటంతో వెంకీ మామపై భారీ హైప్‌ నెలకొంది. అందుకు తగ్గట్టుగా ఓపెనింగ్స్‌ కూడా భారీ స్థాయిలో వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు ఈ సినిమా 6.5 కోట్ల వసూళ్లు సాధించి సత్తా చాటింది. వరల్డ్‌ వైడ్‌గా ఫస్ట్ డే 8 కోట్ల వరకు గ్రాస్‌ సాధించింది వెంకీ మామ.

 

ఇక ఈ సినిమాకు పోటిగా మరే సినిమా లేకపోవటం, సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్‌ నుంచి పాజిటివ్‌ రెస్పాన్స్‌ రావటంతో వెంకీ మామ మంచి వసూళ్లతో దూసుకుపోతున్నాడు. వీకెండ్‌ మామా అల్లుళ్లకు బాగా కలిసోచ్చింది. దీంతో రెండో రోజు కూడా థియేటర్ల ముందు హౌజ్‌ఫుల్‌ బోర్డులు కనిపించాయి. రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 11.88 కోట్ల షేర్‌ సాధించిన వెంకీ మామ ప్రపంచ వ్యాప్తంగా 15.28 కోట్ల షేర్‌ వసూళు చేసినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. నిజంగా ఇలాంటి కలెక్షన్స్ వస్తాయని నిర్మాత సురేష్ బాబు కూడా ఊహించి ఉండరు. మొదటి రోజు కాస్త నిరాశ పడినప్పటికి రెండవరో రోజు వచ్చిన కలెక్షన్స్ చూసి బాబు చాలా హ్యాపీగా ఉన్నారట.

 

ఇక సినిమాలో కొన్ని సీన్స్‌పై డివైడ్‌ టాక్‌ వినిపిస్తున్నా మామా అల్లుళ్ల జోడి విషయంలో మాత్రం యునానిమస్‌గా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. రియల్‌ లైఫ్ క్యారెక్టర్స్‌లో వెంకీ, చైతూలు ఒదిగిపోయారు. ముఖ్యంగా కామెడీ, ఎమోషనల్‌ సీన్స్‌లో ఈ ఇద్దరి పర్‌ఫార్‌మెన్స్ సూపర్బ్ అన్న టాక్‌ వినిపిస్తోంది. ఫస్ట్ హాఫ్‌ కామెడీ సీన్స్‌లో చైతూ, వెంకీలు ఒకరితో ఒకరు పోటీ పడి మరీ నటించారు. ఇక ఈ సినిమాలో వెంకీకి జోడిగా పాయల్ రాజ్‌పుత్‌, నాగచైతన్య సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా నటించారు. సురేష్‌ బాబు, టీవీ విశ్వప్రసాద్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు బాబీ (కేయస్‌ రవీంద్ర) దర్శకుడు. తమన్‌ సంగీతమందించాడు. ఈ సినిమా బ్రేక్‌ ఈవెన్‌ కావాలంటే దాదాపు 33 కోట్ల వసూళ్లు సాధించాల్సి ఉంది. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తుంటే వెంకీ మామకు ఇదేమంత పెద్ద టార్గెట్‌ కాదని ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: