‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన యాంగ్రీ హీరో కార్తీ ఇప్పుడు ‘దొంగ’గా రానున్నాడు. ఈ చిత్రంలో కార్తీకి వదిన, సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటిస్తున్నారు. జీతు జోసెఫ్‌ దర్శకత్వంలో రూపొందిన డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో హీరో కార్తీ విలేకర్లతో మాట్లాడారు. ఆ విశేషాలు మీకోసం…
 


‘ఖైదీ’ లాంటి బ్లాక్ బస్టర్ తరువాత ‘దొంగ’ వస్తోంది. ఈ సినిమా అంచ‌నాలు గురించి...

అంచనాలు మరీ ఎక్కువైతే డేంజర్ అండి. ఒక ర‌కంగా అదీ కొంచం క‌ష్ట‌మే తిరిగి అలాంటి హిట్ ని ప్రేక్ష‌కుల‌కి ఇవ్వ‌డ‌మంటే ఇంకా బాగా క‌ష్ట‌ప‌డాలి.  అయితే సినిమా చేసేటప్పుడు అవన్నీ నేను ఆలోచించను. నాకు సినిమా నచ్చితేనే చేస్తాను. అందుకే 13 సంవత్సరాలు అవుతున్నా కేవలం 19 సినిమాలే చేశాను. నేను న‌టించిన  ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాను.
 

 ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పాయింట్‌?

ఫస్ట్ స్క్రిప్టే అండి. లైన్ విన్నప్పుడే బాగా కనెక్ట్ అయింది. ఆ తరువాత రెండు పేజీల కథ చెప్పారు. అప్పుడు అక్క క్యారెక్టర్ గురించి చెప్పారు. ఆ క్యారెక్టర్ ఇంకా బాగా నచ్చింది. వదిన జ్యోతికకు కూడా ఆ క్యారెక్టర్ బాగా నచ్చడంతో ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నాం. ఇద్ద‌రికీ ఇందులోని ఎమోష‌న్స్ బాగా న‌చ్చాయి. 
 

సినిమా అవుట్ పుట్ ఎలా వచ్చింది ?

సినిమా ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. డీసెంట్ కామెడీ ఉంటుంది, సినిమాలో స్ట్రాంగ్ ఎమోషన్ తో పాటు సప్సెన్స్ ఉంటుంది. దృశ్యం డైరెక్టరే ఈ సినిమానికి డైరెక్టర్ కాబట్టి అతని డైరెక్షన్ స్కిల్స్ కూడా సినిమాకి బాగా ప్లస్ కానున్నాయి.

 

సినిమాలో మీ రోల్ గురించి ?

సినిమా టైటిల్ లోనే రివీల్ చేసినట్లు సినిమాలో కూడా నేను దొంగనే. అలాంటి వ్యక్తి ఎలా మారాడు. ఈ మధ్యలో అతని జర్నీ ఎలా సాగింది అనేది ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో షావుకారు జాన‌కిగారు కూడా న‌టించారు. కానీ ఆమెకి డైలాగ్స్ పెద్ద‌గా ఉండ‌వు. కానీ ఆమె క‌ళ్ళ‌తోనే మొత్తం హావ‌భావాల‌న్నీ చాలా అద్భుతంగా ప్ర‌ద‌ర్శించారు. డైరెక్ట‌ర్‌గారికి ఆడియ‌న్స్ మీద చాలా గౌర‌వం ప్ర‌తీ లాజిక్ కి ఒక మీనింగ్ ఉండేలా సినిమాని తీశారు. అలాగే ప్ర‌తీ క్యారెక్ట‌ర్ నుంచి చాలా అద్భుత‌మైన న‌ట‌న‌ను బ‌య‌ట‌కు తెప్పించారు. 

 

మొదటిసారి మీ వదిన జ్యోతికగారితో కలిసి నటించడం ఎలా అనిపించింది ?

కొత్తగా ఏమి అనిపించలేదండి. రెగ్యులర్ గా ఇంట్లో కూర్చుని మాట్లాడుకున్నట్లే ఉండేది. ఎందుకంటే క్యారెక్టర్స్ కూడా అలాంటివే. అయితే ఆవిడ యాక్టింగ్ స్కిల్స్ గ్రేట్. పైగా ఆవిడది స్ట్రాంగ్ క్యారెక్టర్. అలాగే ఫాదర్ రోల్ లో నటించిన సత్యరాజ్ గారిది కూడా స్ట్రాంగ్ క్యారెక్టర్. అలాంటి ఆర్టిస్ట్ ల పక్కన చేయటం బాగా అనిపించింది. అలాంటి ఇద్ద‌రు గ్రేట్ ఆర్టిస్ట్‌లు న‌టిస్తున్న‌ప్పుడు నేను ఇంకాస్త జాగ్ర‌త్త‌గా న‌టించాల్సి వ‌చ్చింది. ఈ చిత్రంలో నా పాత్ర నాకు కొంచం ద‌గ్గ‌ర‌గానే ఉంటుంది జోక్‌గా ఇంట్లో ఎలా ఉంటామో అలానే ఉంది. 

 

సినిమాలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని విన్నాం ?

అవును.. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అవి సినిమాలోనే హైలైట్ గా నిలుస్తాయి. ఒక విధంగా ఈ సినిమా ఎమోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. అన్ని ఎమోష‌న్స్ చాలా బాగా వ‌చ్చాయి. కాక‌పోతే కాస్త సాంగ్స్ అంటేనే కొంచం జ్వ‌ర‌మొచ్చేది. 
 

మీ తదుపరి సినిమా గురించి ?

ప్రస్తుతం ఒక సినిమా జరుగుతుంది, ఆల్ రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది.

చిరంజీవిగారి టైటిల్స్ తీసుకుంటున్నారు?
అలా ప్ర‌త్యేకించి తీసుకోవ‌డం ఏమీ లేదు. అలా వ‌స్తున్నాయంతే. అలాగే నాగార్జున‌గారి ట్వీట్స్‌లో థ్యాంక్యూ సార్ అని పెడితే  ఫ్యాన్స్ అంద‌రూ తిడుతున్నారు అన్న‌య అని పెడుతున్నాను అని అన్నారు.  ఫైన‌ల్లీ నా పేరు శివ‌, ఊపిరి సినిమా క‌లిపితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: