మల్టీ స్టారర్ చిత్రాలు చేయడం లో ఎప్పుడు ముందు వరుసలో  ఉంటాడు విక్టరీ వెంకటేష్.  కథ నచ్చితే చాలు  మరో హీరో తో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి ఏ మాత్రం మొహమాటపడడు.  ప్రస్తుతం టాలీవుడ్ లో ఇప్పుడున్న హీరోల్లో  ఎక్కువ మల్టీ స్టారర్ సినిమాలు చేసింది  కూడా వెంకీనే.  అలా వెంకీ చేసిన మల్టీ స్టారర్ లలో దాదాపు అన్ని  ఘన విజయాలు సాధించాయి.  ఇక ఈఏడాది  సంక్రాంతికి  ఎఫ్ 2 తో ప్రేక్షకులముందుకు వచ్చాడు వెంకీ. ఈచిత్రంలో వరుణ్ తేజ్ తో మరో హీరో గానటించాడు.  ఈ చిత్రం యావరేజ్  రివ్యూస్ ను సొంతం చేసుకుంది. 
 
అయితే వెంకీ తన కామెడీ టైమింగ్ తో ఫ్యామిలీ ప్రేక్షకులను  థియేటర్లకు  రప్పించాడు. ఎంతలాంటే దాదాపు 30కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన  ఈ చిత్రం 80కోట్ల వసూళ్లను రాబట్టేదాకా.  సినిమా విడుదలైయ్యాక  ఏముంది ఇందులో అన్న వాళ్ళు వున్నారు , అలాగే  ఎఫ్ 2.. జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర  స్కిట్ లలాగే ఉందని కూడా కామెంట్లు  వచ్చాయి.  కానీ  వెంకీ మ్యాజిక్ వర్కౌట్ అవ్వడంతో  సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. అలా సింగిల్ హ్యాండ్ తో సినిమాను హిట్ చేయించాడు వెంకీ. ఒకవేళ వెంకీ కాకుంటే మరో హీరో తో ఈసినిమా చేసుంటే డిజాస్టర్ అయ్యేదే. 
 
ఇక ఈఏడాది వెంకీ మామ తో  మరో సారి ప్రేక్షకులముందుకు వచ్చాడు వెంకీ.   ఈచిత్రం లో  నాగ చైతన్య మరో హీరో గా  నటించాడు.  ఈశుక్రవారం విడుదలైన ఈ చిత్రం కూడా మిక్సడ్ రివ్యూస్ ను తెచ్చుకుంది. కానీ   స్క్రీన్ మీద వెంకీ -చైతన్య కెమిస్ట్రీ వర్క్ అవుట్ కావడంతో  రివ్యూస్ తో సంబంధం లేకుండా రెండు రోజుల్లోనే 30కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి అదుర్స్ అనిపించుకుంది.  ఇక ఈరోజు  కూడా  థియేటర్లు హౌస్ ఫుల్ కావడం తో 8కోట్ల వరకు  గ్రాస్ వసూళ్లను రాబట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.  ఎఫ్ 2లాగే ఈచిత్రాన్నీ కూడా తన భుజాలపై వేసుకొని నడిపించాడు వెంకటేష్. కామెడీ , ఎమోషన్స్ , యాక్షన్ తో  ఇలా ప్రతి దాంట్లో చెలరేగిపోయి  సినిమా అంత వన్ మ్యాన్ షో చేశాడు.వీటికి  తోడు వెంకీకి  ఎలాగూ  ఫ్యామిలీ ప్రేక్షకుల సపోర్ట్ వుండడంతో బాక్సాఫీస్ వద్ద ఈచిత్రం అదరగొడుతుంది. అయితే  సోమవారం నుండి  ఎలాంటి రన్ ను కొనసాగిస్తుందనే దానిపైనే ఈచిత్ర విజయావకాశాలు అదరపడివుండనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: