రాఘవ లారెన్స్..... ప్రముఖ డాన్సర్ మరియు కొరియోగ్రాఫేర్... అంతేకాకుండా అయన తమిళ తలైవా అయిన రజినీకాంత్ కి వీరాభిమాని.. ఆయనని చిన్నప్పటి నుంచి రజినీకాంత్ అంటే పిచ్చి. రజినీకాంత్ రీసెంట్ గా దర్భార్ మూవీ లో నటిస్తున్నారు..

 

ఈ మధ్య చెన్నై లో దర్భార్ మూవీ ఆడియో లాంచ్ లో లారెన్స్ చెప్పిన ప్రసంగం వల్ల చిక్కుల్లో పడ్డాడు.. లారెన్స్ మాట్లాడుతూ" చిన్నతనంలో కమలహాసన్ పోస్టర్ లపై పేడ విసిరేవాడినని తెలిపారు"... దీనితో కమల్ ఫ్యాన్స్ తీవ్ర అసహనానికి గురి అయ్యారు... లారెన్స్ మీద సోషల్ మీడియా, ట్విట్టర్, పేస్ బుక్ వేదికగా లారెన్స్ ని తీవ్రంగా  విమర్శిస్తున్నారు..

 

లారెన్స్ దీనికి వివరణ ఇచ్చే ప్రయత్నంగా పర్సనల్ గా కమలహాసన్ ని కలిసి వివరణ ఇచ్చారు.... కమల్ హాసన్ తో లారెన్స్ ఆప్యాయంగా దిగిన ఫోటోను సోషల్ మీడియా లో షేర్ చేసారు... ఈ సందర్బంగా లారెన్స్ అభిమానులకి వివరణ ఇచ్చారు.. "నేను చిన్నప్పటి నుంచి రజినీకాంత్ కి వీరాభిమానిని" రజినీకాంత్ సినిమాలంటే విపరీతంగా చూసేవాడిని.. వేరే హీరోని ఇష్టపడేవాడిని కాదు..

 

ఆ అభిమానంతోనే కమల్ హాసన్ సినిమా పోస్టర్ల పైన పేడ విసిరేవాడిని. అంతేకాని కమల్ హాసన్ గారి మీద ఎటువంటి బాడ్ ఒపీనియన్ లేదు అని తెలిపారు... పెద్దయ్యాక కమలహాసన్ ని కూడా
అభిమానించాను అని తెలిపారు.. కమలహాసన్ మరియు రజినీకాంత్ ఇద్దరు కలిసి నడుస్తూ ఉంటే సంతోషంగా ఉందని తెలిపారు.

అంతేకాని నేను కమల్ హాసన్ గారిని ఉద్దెశించి ఏమి మాట్లాడలేదని తెలిపారు.. కమలహాసన్ ఫ్యాన్స్ నన్ను తప్పుగా అనుకోవద్దని వివరణ ఇచ్చారు. నిజంగా నేను తప్పు చేసి ఉంటే క్షమాపణ అడిగేవాడినని కాని అంత  పెద్ద తప్పు ఏమి చేయలేదని తెలిపారు.. చిన్నతనంలో రజినీకాంత్ మీద ఉన్న అభిమానంతో అలా చేసానని, కాని కమలహాసన్ మీద ద్వేషo లేదని తెలిపారు.

 

కమలహాసన్ సార్ అంటే ఎంతో గౌరవం అని తెలిపారు. దయవుంచి నన్ను ఎవరు తప్పుగా అనుకోవద్దని తెలిపారు. కమల్ హాసన్ ని కలవటానికి వెళ్ళినపుడు నాపై ఎంతో ప్రేమ చూపించారు అందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు... లారెన్స్ ప్రస్తుతం కాంచన మూవీ సీక్వెల్స్ ని హిందీ లో "లక్ష్మి బాంబ్ "పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఒక కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: