టెన్నిస్ స్టార్  సానియా మీర్జా సోదరి తో , క్రికెటర్ అజారుద్దీన్ కుమ్మరుడి వివాహం హైదరాబాద్ లో అంగరంగవైభవంగా జరిగింది. ఈ పెళ్లికి అటు అజారుద్దీన్, ఇటు సానియా మీర్జా అతికొద్దిమంది సన్నిహితులని ఆహ్వానించారు. కుటుంబ సభ్యులు, చుట్టాలు, సన్నిహితుల మధ్యన సానియా మీర్జా చెల్లి వైభవంగా జరిగింది.

 

ఇక ఈ పెళ్లి కి రామ్ చరణ్ సతి సమేతంగా హాజరయ్యాడు. అజార్ తో, సానియా తో రామ్ చరణ్ దంపతులు  సరాదాగా ఫొటోస్ కి ఫోజులిచ్చారు. ప్రస్తుతం ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.  ఇక బాలీవుడ్ నుండి ప్రముఖ కొరియో గ్రాఫేర్, దర్శకురాలు ఫరా ఖాన్ కూడా హాజరయ్యింది. రామ్ చరణ్ తో ఫరా ఖాన్ సెల్ఫీ దిగడమే కాదు.. మై న్యూ ఫ్రెండ్ అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.

 

అయితే ఈ పెళ్ళిలో ప్రధాన ఆకర్షణగా నిలిచిన రామ్ చరణ్ తన బెస్ట్ ఫ్రెండ్ సానియా మీర్జా, ఫరా ఖాన్ తో స్టేజ్ మీద డ్యాన్స్ తో దుమ్ముదులిపాడు. పెళ్లి వేడుకలో రామ్ చరణ్ డ్యాన్స్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. రామ్ చరణ్ తో పాటు సానియా మీర్జా మరియు దర్శకురాలు ఫరా ఖాన్ లు డాన్స్ చేస్తూ అందరిని ఉర్రుతలూగించారు. ఈ వీడియోను చెర్రీ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు . రా చరణ్ ఎక్కడున్నా డాన్స్ కింగే అంటూ కామెంట్లు పెడుతున్నారు.

 

రామ్ చరణ్ స్టెప్పులతో సమానంగా వేసిన సానియా స్టెప్పులు అందరిని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్  మీడియాలో వైరల్ అవుతుంది. టెన్నిస్ తార కూడా స్టెప్పులు వేయగలదు అంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు.  అయితే ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ సినిమానే ఆర్ ఆర్ ఆర్.. 2020 లో ఈ చిత్రం విడుదల కానుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: