టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉన్న డైరెక్టర్లలో ఒకరు శేఖర్ కమ్ముల. ఈయన తీసే ప్రతి సినిమా ఓవర్సీస్ లో భారీ రేటు పలుకుతుంది. ఇందుమూలంగా చాలామంది ఇండస్ట్రీలో ఉన్న నిర్మాతలు శేఖర్ కమ్ముల తో సినిమా చేస్తే కచ్చితంగా మినిమం లాభాలు సాధించవచ్చని ఆయనతో సినిమా చేయడానికి ఎగబడుతుంటారు. ముఖ్యంగా ఆయన తెరకెక్కించిన చివరి సినిమా ‘ఫిదా’ సినిమా ఓవర్సీస్ లో అదిరిపోయే విజయాన్ని యూఎస్ లో అదిరిపోయే కలెక్షన్లు సాధించింది ఈ సినిమా.

 

ఇటువంటి తరుణంలో ప్రస్తుతం శేఖర్ కమ్ముల … తెరకెక్కిస్తున్న నాగ చైతన్య సినిమా కి ఓవర్సీస్ లో సరైన బిజినెస్ జరగటం లేదని టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే ప్రస్తుతం నాగచైతన్య మరియు విక్టరీ వెంకటేష్ నటించిన 'వెంకీ మామ' సినిమా ఓవర్సీస్ లో అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేకపోయింది. దీంతో శేఖర్ కమ్ముల నాగచైతన్యతో తీస్తున్న సినిమాపై ఆ ఎఫెక్ట్ పడినట్లు ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి.

 

విషయంలోకి వెళితే డైరెక్టర్ శేఖర్ కమ్ముల గత చిత్రాల తరహాలోనే నాగ చైతన్య తో తెరకెక్కిస్తున్న సినిమాతో ఓవర్ సీస్ బిజినెస్ బాగా చేద్దామని అనుకున్నారు. అయితే ‘వెంకీ మామ’ రిలీజ్ అయ్యాక ...ఆ సినిమా సక్సెస్ కూడా ప్లస్ చేసుకుంటే బాగా వర్కవుట్ చేయవచ్చని అనుకొని ఓవర్ సీస్ మార్కెట్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. అయితే వెంకీ మామ సినిమా రిజల్ట్ ఇచ్చిన షాక్ కి ఏం చేయలేని స్థితిలో శేఖర్ కమ్ముల ఉన్నట్లు సమాచారం. ఇటీవల చాలా అంచనాలు పెట్టుకున్న సైరా, సాహో మరియు తాజాగా 'వెంకీ మామ' అనే పెద్ద పెద్ద సినిమాలు మొత్తం బోల్తా పడుతున్న తరుణంలో ఓవర్ సీస్ లో కొన్న డిస్ట్రిబ్యూటర్లు కూడా పెద్ద డైరెక్టర్ దర్శకత్వం వహించిన సినిమా కొనాలన్నా చాలా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

దీంతో నాగచైతన్య సినిమా ని భారీ స్థాయిలో రిలీజ్ చేద్దాము అనుకున్న శేఖర్ కమ్ముల పరిస్థితి ప్రస్తుతం పాపం అన్నట్టుగా ఉందని.. ఓవర్ సీస్ లో టాలీవుడ్ పెద్ద పెద్ద సినిమాలు బోల్తా పడుతున్న తరుణంలో వాటి రిజల్ట్ ఎఫెక్ట్ శేఖర్ కమ్ముల- నాగ చైతన్య సినిమా కి బాగా పడిందని ..ఇందుమూలంగా ఓవర్ సీస్ లో శేఖర్ కమ్ముల సినిమా రేటు చాలా తక్కువ పలుకుతున్నట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: