వివాదాస్పద దర్శకుడిగా మారిపోయిన సెన్సేషనల్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించే ఏ సినిమా అయినా సంచలనం కావాల్సిందే. సమాజంలో జరిగే సంఘటనలనే కంటెంట్ ని చేసుకుని కథగా అల్లుకోవడం ఆయన స్పెషల్. కథలు రాసుకోవడం మానుకుని ఇలాంటి సంఘటనలనే ఇతివృత్తం చేసుకుని ఆయన సినిమాలు తీస్తున్నాడు. ఆ పరంపరలో తీసిన సినిమానే అమ్మరాజ్యంలో కడపబిడ్డలు. ఇటివలే విడుదలైన ఈ సినిమాకు నెగటివ్ టాక్ వచ్చింది. కానీ.. సినిమా ఆద్యంతం ఫన్ క్రియేట్ చేయడంలో ఆర్జీవీ సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఆయన స్పందించాడు.

 

 

‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు రిలీజ్ ఆలస్యంతో చాలా నష్టపోయాం. సినిమాను అడ్డుకున్న వాళ్లపై కేసులు వేస్తా. టీడీపీ నాయకుడు ఇంద్రసేనా చౌదరి, కేఏపాల్, సెన్సార్ బోర్డు జ్యోతిపై కేసులు వేస్తా. పవన్ ఫ్యాన్స్ కు రిప్‍లు పెట్టడం తప్ప వాళ్లకు కళ గురించి ఏమాత్రం తెలీదు’ అని దర్శకుడు రామ్‍గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి టైటిల్ జనాల్లోకి వెళ్లిపోయింది. కానీ విడుదల సమయంలోనే పలు అభ్యంతరాలు వచ్చాయి. దీంతో పలువురు సినిమా విడుదలపై హైకోర్టు వరకూ వెళ్లారు. దీంతో సినిమా ఆలస్యమైంది. మొత్తానికి సినిమాను విడుదల చేసినా ఆర్ధికపరమైన లావాదేవీల్లో నష్టం వచ్చినట్టు రామ్ గోపాల్ వర్మ అంటున్నాడు.

 

 

సినిమాగా చూస్తే అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అంతా ఫన్ గా ఉంటుందని స్పష్టమవుతోంది. కేవలం ఆయా పాత్రల ద్వారా కామెడీని పండించడం తప్ప ఆర్జీవీ పెద్దగా కష్టపడింది లేదు. కేవలం టైటిల్ మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. మరి.. విడుదల ఆలస్యం కావటం వల్ల నష్టం వచ్చిందంటున్న వర్మ ఏమేరకు ముందుకెళ్తారో.. నష్టం రావటానికి కారుకులని  వర్మ ఆరోపిస్తున్నవారు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: