సైరా నరసింహారెడ్డితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి షార్ట్‌ గ్యాప్ తరువాత తన తరువాత సినిమా కి రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో తన నెక్ట్స్ సినిమాను లాంచనంగా ప్రారంభించిన మెగాస్టార్‌ త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ను ప్రారంభించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో చిరు యంగ్‌గా స్లిమ్‌ లుక్‌లో కనిపించనున్నా డన్న టాక్‌ వినిపిస్తోంది. సైరా కి చిరు మేకోవర్ ఎంతగా చేసి నరసింహా రెడ్డి లుక్ వచ్చేలా కసరత్తు చేశారో..ఇప్పుడు చిరు 152 కోసం అంతకంటే వినూత్నంగా కంప్లీట్ మాస్ అండ్ క్లాస్ లుక్ ఉండేలా కొత్త తరహా మేకోవర్ తో సిద్దమయ్యారట మెగాస్టార్. 

 

అయితే ఈ సినిమాలో చిరుకు జోడిగా నటించబోయే ఆ బ్యూటి ఫుల్ హీరోయిన్ ఎవరన్న విషయంలో ఇంతకాలం  క్లారిటి లేకుండా ఉండింది. ముందుగా కాజల్‌ అగర్వాల్ చిరు సరసన మరోసారి నటించనుందన్న ప్రచారం జరిగింది. తరువాత మరికొంత మంది హీరోయిన్ల పేర్లు తెర మీదకు వచ్చినా ఫైనల్‌గా చెన్నై బ్యూటికి ఓటు వేశారట మెగాస్టార్‌ చిరంజీవి. కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమాలో త్రిష, మెగాస్టార్‌కు జోడిగా నటింస్తుందన్న విషయం అఫీషియల్ గా కన్‌ఫార్మ్‌ చేశారు. ఈ విషయాన్ని త్రిష తన సోషల్ మీడియా పేజ్‌లో ధృవీకరించింది కూడా. త్రిష ఇండస్ట్రీకి వచ్చిన 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పలువురు సినీ విశ్లేషకులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్‌ చేశారు.

 

17 ఇయర్స్‌ ఆఫ్‌ త్రిషాఇజం అన్న హ్యాష్‌ ట్యాగ్‌ను ట్రెండ్ చేసిన అభిమానులు కొత్త ఏడాదిలో పొన్నియన్‌ సెల్వన్‌, రాంగీ, సినిమాలతో పాటు మోహన్‌ లాల్‌, చిరంజీవి లాంటి టాప్‌ స్టార్స్‌ సరసన నటించేందుకు రెడీ అవుతున్నందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. వారందరికీ త్రిష కృతజ్ఞతలు తెలియజేసింది. అయితే ఈ లిస్ట్‌లో టాలీవుడ్ మెగాస్టార్‌ పేరు కూడా ఉండటంతో కొరటాల శివ సినిమాలో చిరుకు జోడిగా నటించబోయేది త్రిష అన్న విషయం కన్‌ఫార్మ్‌ అయ్యింది. గతంలో వీరిద్దరు స్టాలిన్‌ సినిమాలో కలిసి నటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న చిరు 152 సినిమాను మెగా పవర్‌ స్టార్ రామ్‌ చరణ్‌ నిర్మిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: