టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో డేరింగ్ అండ్ డాషింగ్  డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో ఒక సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. 'ఫైటర్' టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాకు ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలనే ఆలోచనలో పూరి జగన్నాధ్ ఉన్నారని రీసెంట్‌గా వార్తలు వచ్చాయి. ఇప్పటికే హిందీ వెర్షన్ ను ప్రెజెంట్ చేసేందుకు బాలీవుడ్ కరణ్ జోహార్ పూరీ తో కలిశాడు.

 

అంతే కాదు ఈ సినిమా హీరోయిన్ విషయంలో మరో క్రేజీ అప్డేట్ తాజాగా బయటకు వచ్చింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ఒక బాలీవుడ్ హీరోయిన్ ను జోడీగా వెతుకుతున్నారని తెలిసిందే. కరణ్ జోహార్ ఈ సినిమాతో అసోసియేట్ కావడంతో బాలీవుడ్ హీరోయిన్ ఎంపిక పూరికి ఇంకా ఈజీ అయింది. ఈ సినిమాలో హీరోయిన్ గా అతిలోకసుందరి శ్రీదేవి కూతురు జాన్విని ఫైనలైజ్ చేశారట. సినిమాల విషయంలో జాన్వికి కరణ్ జోహార్ ఒక గాడ్ ఫాదర్ లాంటివారన్న విషయం అందరికి తెలిసిందే. ఎంట్రీ సినిమానే కాకుండా జాన్వి కెరీర్ లో ఎంచుకునే సినిమాల బాధ్యత కూడా కరణ్ స్వయంగా చూస్తున్నారు. దీంతో ఈ సినిమాకు జాన్వి సైన్ చేయడంలో ఆయనే కీలకపాత్ర పోషించారట.

 

అంతేకాదు  జాన్వి గతంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'అర్జున్ రెడ్డి' తర్వాత విజయ్ దేవరకొండకు ఫ్యాన్ గా మారిపోయానని వెల్లడించింది. అందుకే ఈ సినిమాకు జాన్వి సైన్ చేసి ఉండొచ్చని అంటున్నారు. త్వరలోనే హీరోయిన్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రానుందని సమాచారం అందుతోంది. ఇక విజయ్ ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షీటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక వేలంటెన్స్‌ డే సందర్భంగా వరల్డ్ ఫేమస్ లవర్ ఫిబ్రవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నిర్మాత కె.ఎస్‌.రామారావు సమర్పణలో క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌పై క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: