ఆర్ ఎక్స్ 100తో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి  మొదటి సినిమాతోనే  బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్నాడు  టాలీవుడ్ యంగ్ హీరో  కార్తికేయ. అయితే  అదే ఊపులో  స్టోరీ ని  పట్టించుకోకుండా  వరసగా సినిమా లు చేసి  చేతులు కాల్చుకున్నాడు ఈహీరో.  అలా హిప్పీ , గుణ 369  చిత్రాలు  పరాజయం చెందగా  వీటి తరువాత  నాని నటించిన  గ్యాంగ్ లీడర్ లో విలన్  రోల్ లో కనిపించాడు కానీ   ఈ చిత్రం కూడా   హిట్ కాలేదు అయితే  కార్తికేయ నటనకు డీసెంట్ రెస్పాన్స్ వచ్చింది. ఇక  ఇటీవల  90ఏం ఎల్ అంటూ మరో సారి అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు కానీ   అదీ  డిజాస్టర్ అయ్యింది.
 
అయినా కూడా  కార్తికేయ కు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. అందులో భాగంగా  తన తదుపరి చిత్రాన్ని  భలే భలే మగాడివోయ్, గీత గోవిందం  వంటి  బ్లాక్ బాస్టర్ సినిమాలను నిర్మించిన  గీతా ఆర్ట్స్  2 బ్యానర్ లో చేయనున్నాడు.   నూతన దర్శకుడు కౌశిక్ తెరకెక్కించనున్న  ఈ చిత్రానికి  'చావు కబురు చల్లగా' అనే టైటిల్ ను  ఖరారు చేశారు.  వచ్చే ఏడాది ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది.
 
ఇదిలావుంటే కార్తికేయ  తాజాగా మరో భారీ ఆఫర్ ను కొట్టేశాడని  వార్తలు వస్తున్నాయి.  కోలీవుడ్ స్టార్ హీరో  తల అజిత్ నటిస్తున్న  60వ చిత్రం లో  కార్తికేయ  విలన్ గా నటించనున్నాడని సమాచారం.  అయితే  ఈ వార్తల పై అధికారికంగా  సమాచారం వెలుబడాల్సి వుంది.  ఖాకి ఫేమ్  హెచ్ వినోత్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి  వళిమయి అనే టైటిల్ ను ఖరారు చేశారు.  ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో  జరుగుతుంది.. ఈచిత్రంలో  అజిత్ , పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.  ఈ  చిత్రాన్ని తమిళ్ తోపాటు తెలుగులోనూ  విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే కార్తికేయ ను  విలన్ గా ఎంచుకున్నారని తెలుస్తుంది.  బోనీ కపూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: