ఎప్పుడు బాలయ్య సినిమాలు అంటే మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్నాడు.. అంటే రౌఢీజం, ఫ్యాక్షన్ కలబోసిన సీన్లు ఉంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. బాలకృష్ణ 105 వ చిత్రంగా తెరకెక్కిన చిత్రం రూలర్.. దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్  రొమాంటిక్ కమర్షియల్ చిత్రం ఈ రూలర్. ఇటీవల ఈ చిత్రం నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ , టీజర్లు, సాంగ్స్ మరియు థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై ప్రేక్షకుల్లోను, సినీ ఇండస్ట్రీలోను, అటు నందమూరి అభిమానుల్లో విపరీతమైన అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. 

 


ఇప్ప‌టి వ‌ర‌కూ వ‌చ్చిన టీజ‌ర్‌లోనూ, ట్రైల‌ర్‌లోనూ పాలిటిక‌ల్ పంచ్‌లు లేవు. కానీ.. ఇప్పుడు `రూల‌ర్‌` కొత్త ట్రైల‌ర్ వ‌చ్చింది. ఈసారి మాత్రం త‌న‌దైన వాడీ చూపించారు బాల‌య్య‌.బాలకృష్ణ మరియు కేఎస్ రవికుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన జైసింహా సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన జోడిగా సోనాల్ చౌహాన్,వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నార.

 


ఇకపోతే ఈ సినిమాలో సీనియర్ నటి జయసుధ, భూమిక చావ్లా ప్రముఖ పాత్రల్లనటిస్తున్నారు.చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని నిర్మాత సి.కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.తాజాగా రూలర్ చిత్రానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సందడి చేసింది. కాగా ఈ ఈవెంట్ అయ్యాకా దగ్గరలోని సింహాచలం దేవస్థానం లోని స్వామివారిని దర్శించుకొని హైదరాబాద్ కు తిరుగు ప్రయాణం చేశారు.

 

విషయానికొస్తే.. ఈ చిత్రం నుండి తాజాగా విడుదల అయిన టీజర్ లో బాలయ్య గ్రేడ్ మార్క్ గా సినిమాలోని రాజకీయ సన్నివేశాలు ఉన్నాయని చూపిస్తూ ఓ టీజర్ ను కట్ చేశారు.. సినిమా పై అంచనాలు మరింత పెంచుతుంది.. మరి సినిమా ఈ రేంజులో ఆకట్టుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: