టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఆయన కెరీర్ 26వ సినిమాగా ప్రస్తుతం తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు పై మహేష్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా సీనియర్ నటి విజయశాంతి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తుండగా, యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, మురళీశర్మ, సంగీత, వెన్నెల కిషోర్, సుబ్బరాజు, 

 

ప్రకాష్ రాజ్ వంటి పలువురు ఇతర నటులు నటిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ మరియు ఫస్ట్ లుక్ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. కాగా సినిమాపై ఫ్యాన్స్ మరియు ప్రేక్షకుల్లో మరింత హైప్ పెంచేందుకు సినిమా యూనిట్, అతి త్వరలో పలువురు సినిమాలోని నటులతో వరుసగా ఒక్కొక్కరితో చిన్న చిట్ చాట్ వీడియోల వంటివి చేయించడానికి సిద్ధం అయ్యారట. మరొక నాలుగు రోజుల్లో అవి యూట్యూబ్ లో ప్రసారం కాబోతున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలోని హీరోయిన్ సోలో సాంగ్ రేపు సాయంత్రం రిలీజ్ కానుంది. 

 

నిజానికి ఇప్పటివరకు రిలీజ్ అయిన రెండు సాంగ్స్ లో మైండ్ బ్లాక్ సాంగ్ కు మిశ్రమ స్పందన లభించగా, సూర్యుడివో చంద్రుడివో సాంగ్ బాగానే శ్రోతల స్పందనను అందుకుంది. ఇక రేపటి మూడవ సాంగ్ మరింత హిట్ అవుతుందని దేవిశ్రీ కూడా నిన్న ట్వీట్ చేస్తూ చెప్పారు. మహేష్ బాబు మిలిటరీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాను జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. మంచి కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా, తప్పకుండా సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం ఆకట్టుకుందని సినిమా యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: