నిన్న ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ తన రాజకీయ జీవితం గురించి అదేవిధంగా తన సినిమాల గురించి అనేక ఆసక్తికర విషయాలు వివరిస్తూ తన అన్నయ్య చిరంజీవికి  తన పై ఉన్న అసంతృప్తిని బయటపెట్టాడు. చిరంజీవి ఆశించిన విధంగా తాను తయారు కాలేదన్న విషయాన్ని వివరిస్తూ కొన్ని షాకింగ్ నిజాలు బయటపెట్టాడు. తన చిన్న తనంలో తనను బాగా చదివించాలని చిరంజీవి బాగా ఆశ పడ్డ విషయాలను వివరిస్తూ తనకు చదవడం ఇష్టమే అయినా పరీక్షలు మార్కుల కోసం చదవడం తనకు అలవాటు కాలేదు అన్న కామెంట్స్ చేసాడు. 

తన ఉద్దేశంలో మార్కుల కోసం టెస్ట్ పెట్టే విద్య విధానం తనకు నచ్చదని అందువల్లనే తనకు చిన్నతనంలో చదువు పట్ల ఆసక్తి ఏర్పడలేదు అన్న విషయాన్ని బయటపెట్టాడు.  తాను చిన్న తనంలో పుస్తకాలు కధలు బాగా చదువుతున్న విషయాన్ని గ్రహించిన చిరంజీవి సినిమాలకు కధలు స్క్రీన్ ప్లే ఎలా రాయాలో తెలుసుకోమని ప్రోత్సహించిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. అయితే తన దృష్టి అంతా  సినిమా దర్శకత్వం పై ఉండేది అంటూ తాను సినిమా హీరో అవుతానని కలలో కూడ అనుకోలేదు  అంటూ తన సినిమా కెరియర్ పై తనకు తానే జోక్ చేసుకున్నాడు.

ఇదే సందర్భంలో మరో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ తాను తన అన్నయ్య చిరంజీవిలా ఆటుపోట్లకు తట్టుకున్న వ్యక్తిని కాదని అంటూ చిరంజీవి నటనా సామర్ధ్యం ముందు తాను ఏవిషయంలోను సరిపోను అంటూ కామెంట్స్ చేసాడు. అంతేకాదు తాను తన అన్నయ్య చిరంజీవిలా చిన్నతనంలో పెద్దగా కష్టపడకపోయినా సమాజంలో జరుగుతున్న అన్యాయాల పై తనకు విపరీతమైన ఆవేశం వస్తూ ఉండేదని అంటూ తన ఆవేశానికి తన పిచ్చికి సంబంధించి ప్రతి విషయానికి ఒక లెక్క ఉంటుంది అంటూ తన ఆవేశం పై తానే సెటైర్లు వేసుకున్నాడు.  

ఇదే సందర్భంలో తన ‘జనసేన’  సిద్ధాంతాల గురించి మాట్లాడుతూ తప్పు జరుగుతున్నప్పుడు తెలిసినా ప్రశ్నించకుండా తలవంచుకుని నిలబడడానికి తాను పార్టీ పెట్టలేదని జనంలో ఉన్న పిరికితనం పూర్తిగా సమసిపోయేదాకా కలుషిత రాజకీయాలు ఇలాగే ఉంటాయి అన్న అభిప్రాయం వ్యక్తపరిచాడు. తాను అధికారంలోకి వచ్చినా రాలేకపోయినా తన రాజకీయపోరాటం కొనసాగుతూనే ఉంటుంది అంటూ పవన్ చేసినవ్యాఖ్యలు   రాజకీయాలలోని తన గోల్ ని సుచిస్తున్నాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: