యాంగ్రీ హీరో రాజశేఖర్- జీవితల నటవారసురాలు శివాత్మిక దొరసాని సినిమాతో తెలుగు తెరకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇదే సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా పరిచయమయ్యాడు. ఈ సినిమాతో శివాత్మిక కెరీర్ నల్లేరుమీద బండి నడకే అనుకున్నారు. ఎందుకంటే మొదటి సినిమా ఫ్లాప్ కావడం తో మళ్ళీ ఇంకో సినిమా ఛాన్స్ రాలేదు. దాంతో ఇక ఇప్పుడప్పుడే శివాత్మిక కు మళ్ళీ సినిమా పడదని అందరు భావించారు. వెంట వెంటనే చెప్పుకోదగ్గ ఆఫర్లు కూడా రాలేదు. అయితే సినిమా చేస్తాం అంటూ వచ్చిన రెండు మూడు ఆఫర్లని జీవిత తిప్పి పంపించారన్న మాటా ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. కారణం ఏదైనా శివాత్మిక వాట్ నెక్స్ట్ అనే డైలమాలో పడిపోయిందిట.

 

దీంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు రంగంలోకి దిగిన జీవిత కూతురికి బంపర్ ఆఫర్ తగిలేలా సరైన స్కెచ్ వేశారని ఫిలింనగర్ లో టాక్స్ వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమవుతున్న క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ చాలా గ్యాప్ తరువాత రంగమార్తాండ పేరుతో ఓ మరాఠీ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్నారు. సినీ రంగానికి చెందిన క్రేజీ నటులంతా ఇందులో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అందులో భాహంగానే ఈ సినిమాలోని ఓ పాత్ర కోసం శివాత్మికను వరించేలా చేయడంలో జీవిత మంత్రాంగం ఫలించిందట.

 

శివాత్మిక ఎంపిక గురించి ఇంతకుముందే రివీలైనా.. ఆ ఎంపిక వెనక మర్మాంగం మాత్రం తాజాగా రివీలైంది. ఇదంతా జీవిత ప్రోద్బలం .. కృష్ణవంశీ ఆఫర్ ఇవ్వడానికి కారణం జీవిత కృషి .. కూతురు పై తల్లి ప్రేమ ఈ ఛాన్స్ తెచ్చాయని చెబుతున్నారు. అన్ని విధాల ప్రయత్నించి కృష్ణవంశీ ని కన్విన్స్ చేసి కూతురికి రంగమార్తాండ లో అవకాశం వచ్చేలా చేశారట జీవిత రాజశేఖర్. ఇక ఈ సినిమాలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్..ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: