సినిమాలంటే ప్రతి ఒక్కరికీ ఫ్యాషన్.. ఒక్కసారి తెరపై కనిపించేందుకు ఎంత ఉత్సాహపడతారో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మద్య సినిమాల కోసం కొంత మంది పక్కదారి పడుతున్నారు..నేరాలు, ఘోరాలు కూడా చేస్తున్నారు.  తాజాగా ‘ఎవడ్రా’ మూవీ హీరో బషీద్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవడ్రా హీరో అనే చిత్రంలో హీరోగా నటించిన బషీద్ రుణాలు ఇప్పిస్తానంటూ మోసాలకు పాల్పడినట్టు ఫిర్యాదులు అందడంతో హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు బషీద్ ను అరెస్ట్ చేశారు.  కొంత మందికి డబ్బు ఈజీగా సంపాదించవొచ్చు అంటూ ప్రలోభ పెట్టి అందినంత దోచుకున్నారు బషీద్.  

 

ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల నుంచి రుణాల పేరుతో డబ్బు వసూలు చేసినట్టు అతడిపై ఆరోపణలు వచ్చాయి. చిన్నపాటి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు గ్యారెంటర్‌గా ఉండి రుణం ఇప్పిస్తానని చెప్పి మోసాలకు పాల్పడుతున్న సినీ నిర్మాత, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, నటుడు షేక్‌ బషీద్‌ను హైదరాబాద్‌ వెస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అరెస్ట్ చేశారు.  ఒక్కొక్కరి వద్ద రూ.30 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసినట్టు తెలుస్తోంది. దుబాయ్ లోని ఎస్ బీకే గ్రూప్ పేరుతో బషీద్ నకిలీ వ్యాపారం చేసినట్టు గుర్తించారు. ప్రధానంగా దుబాయ్ దౌత్య కార్యాలయం ఇచ్చిన ఫిర్యాదుతో  పోలీసులు రంగంలోకి దిగి బషీద్ ఆటకట్టించారు.

 

తమ వద్ద డబ్బులు దారుణంగా డబ్బులు గుంజాడని బాధితులు వాపోతున్నారు.  కాగా, బీకాం చదివిన బషీద్‌ తొలుత గుంటూరులో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవాడు. 2008లో హైదరాబాద్‌ వచ్చి ఎస్‌బీకే గ్రూప్‌ పేరుతో రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం, ముంబై, చెన్నై, బెంగళూరు, దుబాయ్‌లలో ఫైనాన్స్‌ సంస్థలను ప్రారంభించాడు. పానకాలరావు అనే వ్యక్తి రూ.65 లక్షలు ,  మువ్వా గురవయ్య అనే వ్యక్తి వద్ద రూ.32.50 లక్షలు వసూలు చేశాడు. రుణం మంజూరుపై అడిగిన వీరిద్దరినీ బషీద్‌ బెదిరించాడు. బాధితులిద్దరూ ఫిర్యాదుతో పోలీసులు అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: