2020 లో సంక్రాంతి కానుకగా సినిమా ల జోరు కాస్త ఈ అది కూడా పెద్ద హీరోల సినిమాలు కావడంత సినిమా ల సందడి బాగా ఉందనే చెప్పాలి... అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో... మహేష్ బాబు నటంచిన సరిలేరు నికెవ్వారు చిత్రం పెద్ద సినిమాలనే చెప్పాలి... ఈ రెండు సినిమాలు కేవలం ఒక్క రోజు తేడాతో సందడి చేయబోతున్నయి..


ఇప్పటికే ఈ రెండు చిత్రాల నుండి బయటకి వచ్చిన టీజర్లు పోస్టర్లు పాటలు జానాలను బాగా ఆకట్టుకోవడంతో సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాల తో పాటుగా మరో మూడు సినిమాలు కూడా విడుదల కానున్నాయి.. ఎది ఏమైనా కూడా మహేష్ , బన్నిలలో మాత్రమే పోటీ గట్టిగా ఉందనే చెప్పాలి...ఈ రెండు సినిమాల నుండి ఇప్పటి వరకు చాలా విశేషాలు బయటకొచ్చయి...


వాస్త‌వంగా బన్నీ సాంగ్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. స‌రిలేరు సాంగ్స్‌కు అంత క్రేజ్ రాలేదు. బ‌ట్ బ‌య‌ట ట్రెండింగ్‌లోనూ , ట్రేడ్ వ‌ర్గాల్లోనూ, న్యూట్ర‌ల్ జ‌నాల్లోనూ స‌రిలేరుకే ఎక్కువ క్రేజ్ ఉంది. ఎలా చూసినా, మహేష్‌బాబు కి ఈ సంక్రాంతి బీభత్సమైన అడ్వాంటేజ్‌ అయ్యేలా వుంది. అలాగని, అల్లు అర్జున్‌ని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఏది ఏమైనా, లోపం కన్పిస్తోంది. ఆలోపాన్నిఅధిగమించేందుకు అల్లు అర్జున్‌ కొత్త ఎత్తుగడల్ని ప్లాన్‌ చేయాల్సిందే.


టైమ్‌ చాలా తక్కువగా వుంది.. మహేష్‌ సినిమా ప్రచారం లో దూసుకుపోతోంది.. ఆ జోరు ‘అల వైకుంఠపురం’ విషయం లో అంతగా కన్పించకపోవడం ఆశ్చర్యకరమే మరి. మొత్తంగా చూస్తే అల్లు అర్జున్‌ స్టామినా సరిపోవడంలేదన్న చర్చకు ‘అల వైకుంఠపురములో’ టీం అలసత్వమే ఆస్కారం ఇస్తోందన్నది నిర్వివాదాంశం.  నువ్వా నేనా అని పోటీ పడుతున్నా సినిమాలలో విజయ ఎవరిది అనేది తెలియాలంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే...

మరింత సమాచారం తెలుసుకోండి: