సంక్రాంతి బ‌రిలో రాబోతున్న చిత్రాల్లో ఒక‌టి  సూప‌ర్‌స్టార్ మ‌హేష్ న‌టించిన‌`స‌రిలేరునీకెవ్వ‌రు` మ‌రొక‌టి  స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ న‌టించిన `అల‌వైకుంట‌పురంలో` చిత్రాలు.  ఇవి రెండూ కూడా సంక్రాంతి బ‌రిలో నిలుచున్నాయి. ఒక‌పోతే ఒక చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించగా మరొక‌టి హ్యాట్రిక్ యంగ్ డైరెక్ట‌ర్ అనిల్ రావి పూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక ఇటీవ‌లె విడుద‌లైన `స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రం నుంచి రెండు పాట‌లు విడుద‌ల‌వ్వ‌గా అవి రెండూ ప్రేక్ష‌కుల‌ను అనుకున్న స్థాయిలో అల‌రించ‌లేక‌పోయాయి. ఒక‌ర‌కంగా చెప్పాలంటే మ‌హేష్ సినిమాకు ఆడియో మైన‌స్ అనే చెప్పాలి. స‌రిలేరు సాంగ్స్‌కు అంత క్రేజ్ రాలేదు. బ‌ట్ బ‌య‌ట ట్రెండింగ్‌లోనూ , ట్రేడ్ వ‌ర్గాల్లోనూ, న్యూట్ర‌ల్ జ‌నాల్లోనూ స‌రిలేరుకే ఎక్కువ క్రేజ్ ఉంది. మొన్న‌టి వ‌ర‌కు మెసేజ్ ఓరియంటెడ్ చిత్రాల్లో న‌టించిన మ‌హేష్ కు ఈ చిత్రంతో కాస్త మాసీగా ఎంట‌ర్ టైన్ చెయ్య‌నున్నారు. ఇక ప్రేక్ష‌కులు దీన్ని ఏవిధంగా తీసుకుంటారన్న‌ది తెర మీదే చూడాలి మ‌రి. 


అల్లు అర్జున్ విష‌యానికి వ‌స్తే తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్ప‌టికే ఆయ‌న చిత్రం నుంచి విడుద‌లైన అన్ని పాట‌లు హిట్ అయ్యాయి. కాక‌పోతే గ‌తంలో ఆయ‌న న‌టించిన నాపేరుసూర్య హిట్ కాలేదు. ఆ త‌ర్వాత ఆయ‌న చాలా గ్యాప్ త‌ర్వాత తిరిగి ఈ చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తున్నారు. మరి ఈ చిత్రంతో ఆయ‌న ఏ విధంగా ఉండ‌బోతున్నారు అన్న‌ది వేచి చూడాలి. ఏది ఏమైనా అల్లుఅర్జున్ సినిమాకు కొంత లోపం మాత్రం కనిపిస్తుంది.  ఆ లోపాన్ని అధిగమించేందుకు అల్లు అర్జున్‌ కొత్త ఎత్తుగడల్ని ప్లాన్‌ చేయాల్సిందే.

 

టైమ్‌ చాలా తక్కువగా వుంది.. అలాగే ప్ర‌మోష‌న్స్ విష‌యానికి వ‌స్తే మహేష్‌ సినిమా ప్రచారంలో దూసుకుపోతోంది.. ఆ జోరు ‘అల వైకుంఠపురం’ విషయంలో అంతగా కన్పించకపోవడం ఆశ్చర్యకరమే మరి. మొత్తంగా చూస్తే అల్లు అర్జున్‌ స్టామినా సరిపోవడంలేదన్న చర్చకు ‘అల వైకుంఠపురములో’ టీం అలసత్వమే ఆస్కారం ఇస్తోందన్నది నిర్వివాదాంశం. టాప్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్  సూపర్ స్టార్ మహేష్ 'సరిలేరు నీకెవ్వరు' చిత్రానికి సంగీతం సమకూర్చుతున్న విషయం తెలిసిందే. మొదటి సింగిల్ 'మైండ్ బ్లాక్' మాస్ నంబర్ కి ప్రేక్షకుల నుండి అంత‌గా రెస్నాన్స్ రాలేదు. రెండ‌వ పాట‌ 'సూర్యుడివో చంద్రుడివో` అన్న పాట కూడా ఎక్క‌డా విన‌ప‌డ‌డం లేదు. ఇక అల‌వైకుంఠ‌పురంలో చిత్రానికి థ‌మ‌న్ సంగీతాన్నందించ‌గా విడుద‌లైన అన్ని పాట‌ల‌కు అద్భుత‌మైన స్పంద‌న ల‌భిస్తుంది. రాములో రాములో అంటూ కుర్రాళ్ళ‌ను ఉర్రూత‌లూగిస్తుంది. త‌ర్వాత సామ‌జ‌వ‌ర‌మ‌గ‌న ఇలా అన్ని పాట‌లు దాదాపుగా హిట్స్ అనే చెప్పాలి. ఇక దీన్ని బ‌ట్టి దేవి కాస్త వెన‌క‌ప‌డ్డ‌ట్టే అనిపిస్తుంది. 

 

ఇక‌క్రేజీ  హీరోయిన్ ర‌ష్మిక, మ‌హేష్ ల జంట మొద‌టిసారి అయిన‌ప్ప‌టికీ చూడ‌టానికి చాలా క్రేజీగా ఉంటుంది. అలాగే బ‌న్నీ, పూజాల జంట గ‌త‌లంలో ఆల్రెడీ డీజే లో చూశాం. వారిద్ద‌రి జంట ప‌ర్వాలేదు. తిరిగి మ‌ళ్ళీ పూజాతో బ‌న్నీ జ‌త‌క‌ట్ట‌డం పెద్ద‌గా కొత్త‌గా ఏమీ అనిపించ‌డం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: