టెంప్ట్ చేయ‌డానికి కూడా కూసంత క‌ళాపోష‌ణ ఉండాలి తెలుసా.. ఎందుకంటే టైమ్ చూసి టైమింగుతో కొట్టడం అన్నది అంద‌రికీ సాధ్యం కాదు కాబ‌ట్టి. అయితే ఓ యంగ్ హీరో మాత్రం ఇలాంటి కనికట్టు విద్యలో ఆరితేరిపోయాడట. చాలా మంది తమ అందాలతో కవ్వించడం.. యూత్ ని టెంప్ట్ చేయడం.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకోవడం.. ఇదే ఇప్పుడు ట్రెండ్. కానీ యంగ్ హీరో మాత్రం త‌న మాస్ట‌ర్ మైండ్‌తో యంగ్‌ హీరోయిన్ల‌ను క‌వ్విస్తుంటాడు. ఎవరైనా అందాల భామ బర్త్ డే వస్తే చాలు.. వెంటనే టెంప్టింగ్ చేస్తూ తొలి మెసేజ్ తననుంచే వెళుతోందట. 

 

మిడ్ నైట్ 12 అవ్వగానే షార్ప్ గా అతడి నుంచి సోషల్ మీడియాల్లోనూ మెసేజ్ వెళుతుందట. ఇంకేముంది.. ఆ హీరో టైమ్‌కి.. టైమింగ్‌కి ఫిదా. అయితే ఒక్క టెంప్టింగ్ మాత్రమే కాదు.. స్నేహం చేయడంలో అతడు మహా ఘనాపాటి. తన సరసన నటించిన ప్రతి హీరోయిన్ తో ఎంతో ఇదిగా స్నేహం చేస్తాడు. తనతో కలిసి నటించిన హీరోయిన్తో ఫ్రెండ్షిప్ చేసుకోవడం.... దాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వారికి సర్ప్రైజ్ గిఫ్ట్‌లు ఇవ్వడం.. త‌న హాబీ అని చెప్పుకోవ‌చ్చు. అయితే తాజాగా ఓ హీరోయిన్ కి ఊహించని బర్త్డే గిఫ్ట్ ఇచ్చాడు ఈ హీరో.

 

సోషల్ మీడియా ట్విట్టర్ వేదిక యంగ్ హీరోయిన్ పెయింటింగ్ పిక్ ని సర్ప్రైజ్ గిఫ్ట్ గా పంపాడు. దీంతో ఈ యంగ్ హీరో తనకు ఎంతో క్లోజ్ అయిన ఓ అందాల హీరోయిన్ ని పెళ్లాడతాడంటూ  ఫిలింసర్కిల్స్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరోకు గత కొంత కాలంగా హిట్టు అన్నదానికే దూరమైనా.. క్రేజ్ మాత్రం త‌గ్గ‌లేదు. ఇటీవ‌ల ఓ థ్రిల్లర్ సినిమాతో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ యంగ్ హీరో ద‌గ్గ‌ర మ‌రో మాస్ట‌ర్ క్వాల‌టీ ఏంటంటే.. తాను స్నేహం చేసిన హీరోయిన్లతో ఆయ‌న సినిమాలు కూడా ప్రచారం చేయించుకునే ఘనాసాటి. 

మరింత సమాచారం తెలుసుకోండి: