ఈసంక్రాంతి రేస్ కు రాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ కోసం అనేక వెరైటీ ప్రమోషన్ మార్గాలను అనుసరిస్తున్నారు. ఇప్పటికే అనేక వ్యాపార సంస్థలకు అదేవిధంగా అనేక ప్రముఖ బ్రాండ్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న మహేష్ జాతీయ స్థాయిలో విశేష ఆదరణ కలిగిన ‘హలో’ యాప్ ను ప్రమోట్ చేయడానికి మహేష్ బ్రాండ్ అంబాసిడర్ గా ఇప్పుడు నియమింప బడటం మహేష్ క్రేజ్ ను సూచిస్తోంది. 

ఇప్పటికే మహేష్ అనేక ఆటో మొబైల్ కంపెనీలు హాస్పటల్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతూ తన సినిమాల ఆదాయం కన్నా బ్రాండ్ ప్రమోషన్స్ తో  వచ్చే ఆదాయంతో దక్షిణాది సినిమారంగ హీరోలలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ‘హలో’ యాప్ కోసం మహేష్ ఒక యాడ్ ను చేయడమే కాకుండా ఆయాప్ ద్వారా ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీని కూడ ప్రమోట్ చేయబోతున్నాడు. 

ముంబాయికి చెందిన లేడీ డైరెక్టర్ క్యాతి దర్శకత్వంలో ఈ యాడ్ ను ఈమధ్యనే అన్నపూర్ణ స్టూడియోస్ లో చిత్రీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ ‘హలో’ యాప్ లోకి వస్తున్నట్లు తెలియగానే ఏకంగా 78 వేల ఫాలోయర్స్ అతి తక్కువ కాలంలో మహేష్ ఎకౌంట్ కు ఏర్పడటం అతడి మ్యానియాను సూచిస్తోంది. 

వాస్తవానికి మహేష్ కు బాలీవుడ్ నుండి అనేక ఆఫర్లు వస్తున్నా మహేష్ దృష్టి మాత్రం టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో తాను ఇప్పుడు ఏర్పరుచుకున్న నెంబర్ వన్ స్థానాన్ని కొనసాగించడం పైనే దృష్టి పెట్టాడు. ‘సరిలేరు నీకెవ్వరు’ ఊహించిన స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తే మహేష్ బాలీవుడ్ ఎంట్రీ పై మరింత ఒత్తిడి పెరిగే ఆస్కారం ఉంది. అయితే మహేష్ కోరుకున్న ఈ సక్సస్ సంక్రాంతి కోడి పందాల స్థాయిలో జరుగుతున్న ఈ రేస్ లో సక్సస్ లభించాలి అంటే ‘సరిలేరు నీకెవ్వరు’ కు మొదటి రోజు మొదటి షో నుండి టోటల్ పాజిటివ్ టాక్ వచ్చి తీరాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: