సూపర్ స్టార్ మహేష్ అనీల్ రావిపూడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా మహేష్ కెరియర్ లో మరో సూపర్ హిట్ కొడుతుందని అంటున్నారు. 

 

రీసెంట్ గా రిలీజైన సినిమా టీజర్ కూడా సినిమాపై అంచనాలు పెంచింది. ఇక ఈ మూవీ లో మహేష్ ఎప్పటిలానే స్టైల్, డైలాగ్స్ తోనే కాదు డ్యాన్సులతో కూడా అదరగొడతాడట. స్టార్ హీరోల్లో ఎన్టీఆర్అల్లు అర్జున్, రామ్ చరణ్ డ్యాన్సులు ఇరగదీస్తారు. వాళ్ల సినిమాల్లో డ్యాన్సులు బాగుంటాయి. కాని మహేష్ డ్యాన్సుల పైన విపరీతమైన ట్రోలింగ్స్ వస్తాయి. 

 

అందుకే అలాంటి ట్రోల్స్ కు గూబ అదిరే సమాధానం చెప్పేలా మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాలో డ్యాన్స్ తో అదరగొడతాడు అని తెలుస్తుంది. ఇన్నాళ్లు తనని కామెంట్ చేసిన వారే పొగిడేలా మహేష్ కష్టపడుతున్నాడని తెలుస్తుంది. ఇన్నాళ్ళుగా లేనిది మహేష్ కు డ్యాన్స్ మీద ఇప్పుడు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది అంటే.. తన ఫ్యాన్స్ కూడా మహేష్ డ్యాన్స్ విషయంలో అసంతృప్తిగా ఉన్నారని తెలిసింది. అందుకే మహేష్ సరిలేరు సినిమా డ్యాన్స్ విషయంలో కొత్తగా ట్రై చేస్తున్నాడట. 

 

ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ మహేష్ సాంగ్ కంపోజ్ చేస్తున్నారట. ఈ సాంగ్ సినిమాకే హైలెట్ అవడమే కాకుండా మహేష్ ను డ్యాన్స్ విషయంలో ట్రోల్ చేసే వారి మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుందని అంటున్నారు. ఈ సంక్రాంతికి మహేష్ తో పాటుగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ రెండు సినిమాలు ఒకరోజు తేడాతో వస్తున్నాయి. మరి మహేష్ వర్సెస్ బన్నిలో ఎవరు విజయాన్ని అందుకుంటారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: