నందమూరి ఫ్యామిలీకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతటి మంచిపేరు ఉన్నదో చెప్పక్కర్లేదు. ఈ ఫ్యామిలీకి తెలుగు గ‌డ్డ‌పై కోకొల్లుగా అభిమానులు ఉన్నారు. ఇప్ప‌టికే ఈ ఫ్యామిలీ నుంచి బాల‌య్య‌, ఎన్టీఆర్‌, క‌ళ్యాణ్‌రామ్ హీరోలుగా ఉన్నారు. తార‌క‌ర‌త్న లాంటి వాళ్లు వ‌చ్చినా వాళ్లు క్లిక్ కాలేదు. ఇక ఇండ‌స్ట్రీ సీనియ‌ర్ హీరోల‌లో ఇప్పటికే మెగా, అక్కినేని వారసులు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మంచి విజయాలు సాధిస్తున్నారు.

 

నందమూరి కుటుంబం నుంచి ఎన్టీఆర్ తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. అటు కృష్ణ ఫ్యామిలీ నుంచి మహేష్ బాబు కూడా టాప్ పొజిషన్లో ఉన్నారు. మెగా కుటుంబం నుంచి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎటొచ్చి బాలయ్య కుటుంబం నుంచి వారసుడు ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేదు. మోక్ష‌జ్ఞ సినిమా ఎంట్రీ కోసం నంద‌మూరి అభిమానులు ఎప్పుడో శాత‌క‌ర్ణి సినిమా టైం నుంచి వెయిట్ చేస్తున్నారు.

 

గ‌త రెండు, మూడేళ్లుగా అదుగో ఇదిగో అంటూ కాలం గడుపుతూ వ‌చ్చారు. సినిమాల కోసం మోక్ష‌జ్ఞ హార్స్ రైడింగ్ నేర్చుకున్నారని, సినిమా ఇండస్ట్రీలోకి వస్తారని మొన్నటి వరకు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అవ‌న్నీ పుకార్లే అంటున్నారు. గ‌త కొన్ని రోజులుగా బ‌య‌ట‌కు వ‌స్తోన్న మొక్ష‌జ్ఞ స్టిల్స్ చూస్తుంటే చాలా లావుగా, బొద్దుగా క‌నిపిస్తున్నాడు.

 

సినిమా ఇండస్ట్రీలో వచ్చేందుకు ఏ మాత్రం సిద్ధంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు. ఒక మాములు వ్యక్తి ఉన్నట్టుగా కనిపిస్తున్నాడు తప్పించి హీరోకు ఉండాల్సిన ఫిజిక్ ఉన్నట్టుగా కన్పించడం లేదు. మోక్ష‌జ్ఞ‌కు సినిమాల్లోకి వ‌చ్చేందుకు ఎంత మాత్రం ఇష్టం లేద‌ని.. అందుకే ఎంతో ఫోర్స్ చేసినా అస‌లు మోక్షు ఆ దిశ‌గా ఇంట్ర‌స్టింగ్ గా లేడ‌ని తెలుస్తోంది. ఏదేమైనా ఇదే నిజ‌మైతే నంద‌మూరి ఫ్యాన్స్‌కు పెద్ద బ్యాడ్ న్యూసే అని చెప్పాలి. బాల‌య్య కొడుకు విష‌యంలో ఎందుకు ఇలాంటి డెసిష‌న్ తీసుకుంటున్నాడో ?  వాళ్ల‌కే అర్థంకాని ప‌రిస్థితి.

మరింత సమాచారం తెలుసుకోండి: