బోయపాటి శ్రీను బాలకృష్ణల కాంబినేషన్ లో ప్రారంభం అయిన మూవీకి సంభందించిన కీలక నటీనటుల ఎంపిక వేగంగా జరుగుతున్న పరిస్థితులలో ఈ సినిమాకు సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమాకు సంబంధించి టైటిల్ ప్రకటన నుండి క్రేజ్ తీసుకురావాలి అన్న ఉద్దేశంతో ఈమూవీకి ఒక పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. 

సినిమా స్క్రిప్టును బట్టి దీనికి ‘ఐకాన్' అనే టైటిల్ అయితే అన్నివిధాలా బాగుటుంది అని బోయపాటి భావిస్తున్నట్లు టాక్.  ఈ మూవీలోని బాలకృష్ణ  పాత్ర ప్రజలను చైతన్య పరిచేవిధంగా ఉండే నేపధ్యంలో‘ఐకాన్' అన్న టైటిల్ అన్ని విధాలా సరిపోతుందని బోయపాటి అభిప్రాయం అని అంటున్నారు. ఈ మూవీలో బాలయ్య రైతుగా పారిశ్రామిక వేత్తగా  కనిపించడమే కాకుండా ఈరెండు పాత్రలు మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటాయని అంటున్నారు. 

అయితే ‘ఐకాన్' అనేది అల్లు అర్జున్ మూవీ  టైటిల్ గా ఇప్పటికే ప్రకటింపబడింది. ఈ సినిమాను దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ రూపొందిస్తాడని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే బన్ని సుకుమార్మూవీ ప్రాజెక్ట్ కోసం ఈ మూవీని వెనక్కు తప్పించారు. దీనితో ఆ టైటిల్ ను తమకు ఇవ్వవలసిందిగా బోయపాటి దిల్ రాజ్ తో రాయ బారాలు నడుపుతున్నట్లు టాక్. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విలన్ గా ముందుగా అనుకున్న సంజయ్ దత్ స్థానంలో శ్రీకాంత్ వచ్చి చేరినట్లు వార్తలు వస్తున్నాయి. ‘లెజెండ్’ మూవీతో జగపతి బాబుకు కెరియర్ కు టర్నింగ్ వచ్చినట్లుగా శ్రీకాంత్ కెరియర్ కు టర్న్ ఇచ్చే విధంగా ఈ మూవీ కధలో శ్రీకాంత్ పాత్రను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో బన్నీకోసం ఇప్పటికే ఫిక్స్ చేయపడ్డ టైటిల్ ను బాలయ్యకు ఇవ్వడానికి జరుగుతున్న సంప్రదింపులు ఎంతవరకు విజయవంతం అవుతాయో చూడాలి.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: