టాలీవుడ్, బాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ కొంత కాలంగా తన కాంట్రవర్సీ సినిమాలతో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం.. రాజకీయంగా గందరగోళం సృష్టించడం చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆయనపై ఎన్నో ఆరోపణలు, పోలీసులకు ఫిర్యాదులు, కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. గతంలో వర్మ మాఫియా, హర్రర్ మూవీస్ తో అలరించిన విషయం తెలిసిందే. అయితే కొంత కాలంగా ఆయన బయోపిక్ మూవీస్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు.  రక్త చరిత్ర, వంగవీటి, కిల్లర్ వీరప్పన్  ఈ ఏడాది లక్ష్మీస్ ఎన్టీఆర్.  ఈ ఏడాది ఏపిలో ఎన్నికల సందర్భంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ తెరకెక్కించారు వర్మ.  కానీ ఈ మూవీ రిలీజ్ విషయంలో ఎన్నో కాంట్రవర్సీలు సృష్టించింది.  మిగతా రాష్ట్రాల్లో అనుకున్న సమయానికి రిలీజ్ అయినా.. ఏపిలోమాత్రం రిలీజ్ కాలేదు.  

 

ఎన్నికల తర్వాత ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అప్పటికీ లక్ష్మీస్ ఎన్టీఆర్ చేయాల్సిన సెన్సేషన్, కాంట్రవర్సీ చేసేసింది.  తాజాగా ఇప్పుడు రాంగోపాల్ వర్మ ‘అమ్మరాజ్యంలోకడప బిడ్డలు’ అనే మూవీతో మరోసారి కాంట్రవర్సీ సృష్టించారు.  మొదట కమ్మరాజ్యంలోకడప రెడ్లు అని మార్చారు.  తర్వాత కమ్మరాజ్యంలో కడప బిడ్డలు.. చివరిగా అమ్మరాజ్యంలో కడప బిడ్డలు అని రిలీజ్ చేశారు. ఇక ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫిర్యాదు నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై  సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు వర్మకు నోటీసులు పంపారు.

 

రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసుల నోటీసులు జారీ చేశారు. రేపు సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. కేఏ పాల్ ఫిర్యాదు మేరకు వర్మపై కేసు నమోదైంది. తన ఫోటోలు, వీడియోలు మార్పింగ్ చేశారని ఫిర్యాదులో కేఏ పాల్ పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వీళ్ళ ముందు హాజరు కాబోతున్నాడు వర్మ. మరోవైపు తాను కూడా కేఏ పాల్‌పై పరువునష్టం దావా వేస్తానని చెబుతున్నాడు ఆర్జీవీ. మరి దీనిపై వర్మ ఎలాంటి స్పందన ఇస్తారో చూడాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: