ఇటీవల జరిగిన బిగ్ బాస్ సీజన్ 3 లో రన్నరప్ గా నిలిచిన యాంకర్ శ్రీముఖి, ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని తన స్నేహితులకు విహార యాత్రకు వెళ్లడం జరిగింది. ఇక ఆ షో తో ఆమెకు మరింత విపరీతంగా ఫాలోయింగ్ మరియు క్రేజ్ పెరిగాయి అనే చెప్పాలి. తరువాత ఆమె తిరిగి రాగానే స్టార్ మ్యూజిక్ రిలోడెడ్ అనే ప్రోగ్రాం లో పాల్గొనడం జరిగింది. ఈ షో ప్రస్తుతం స్టార్ మా ఛానల్ లో ప్రసారం అవుతోంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం, 

 

ఈ షోకు మంచి ప్రేక్షకాధరణ తో పాటు రేటింగ్స్ కూడా అద్భుతంగా వచ్చాయని అంటున్నారు. ఇక ఇటీవల అనారోగ్యం బారిన పడిన యాంకర్ ప్రదీప్, కొంత గ్యాప్ తరువాత ప్రస్తుతం చేస్తున్న షో లోకల్ గ్యాంగ్స్. జీ తెలుగు ఛానల్ లో ప్రసారం అవుతున్న ఈ షోలో అనసూయ మరియు జానీ మాస్టర్ జడ్జీలుగా వ్యవహరిస్తున్నారు. కాగా ఈ షోకు కూడా బాగానే రేటింగ్స్ వచ్చాయని అంటున్నారు. అయితే నిన్న రిలీజ్ అయిన లేటెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ప్రకారంగా చూస్తే, 

 

శ్రీముఖి మ్యూజిక్ రి లోడెడ్ షోకు, ప్రదీప్ లోకల్ గ్యాంగ్స్ షో కంటే కూడా చాలా ఎక్కువగా రేటింగ్స్ వచ్చినట్లు చెప్తున్నారు. శ్రీముఖికి ముఖ్యంగా ఆడవాళ్ళతో పాటు యువతలో కూడా మంచి క్రేజ్ ఉందని, అలానే ఆమె గత షోలతో పోలిస్తే ప్రస్తుతం మ్యూజికల్ షోగా చేస్తున్న ఈ షో పై మరింత క్రేజ్ ఉండడంతోనే దానికి అంత ఎక్కువ రేంజ్ లో రేటింగ్స్ వచ్చాయని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఈ విధంగా ఒకరకంగా ప్రదీప్ మాచిరాజును శ్రీముఖి రేటింగ్స్ పరంగా వెనక్కి నెట్టింది అనే చెప్పాలి. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది.....!!   

మరింత సమాచారం తెలుసుకోండి: