గత కొంతకాలంగా విడుదల అవుతున్న టాప్ హీరోల సినిమాలు ఎంత భారీ బడ్జెట్ తో తీసినా ఆమూవీల కథలో సెకండ్ హాఫ్ వచ్చే సరికి తేలిపోవడంతో సగటు ప్రేక్షకులకు నచ్చడం లేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనితో టాప్ హీరోల సినిమాల కథలకు సంబంధించి ఫస్ట్ హాఫ్ తో పాటు సెకండ్ హాఫ్ లోని సన్నివేశాలు ప్రీ క్లైమాక్స్ క్లయిమాక్స్ లలో వచ్చే సీన్స్ అత్యంత కీలకంగా మారుతున్నాయి.

ప్రస్తుతం సంక్రాంతి రేస్ కు రాబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీలకు సంబంధించి కూడ సెకండ్ హాఫ్ సమస్యలు ఉన్నాయి అంటూ వస్తున్న వార్తలు ఈరెండు మూవీల బయ్యర్లను కలవర పెడుతున్నట్లు టాక్.  మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' లో  మొదటి భాగంలో మిలిటరీ నేపథ్యంతో పాటు ఆతరువాత  ట్రైన్ జర్నీలో ఫన్ అంతా పర్ఫెక్ట్ గా ఉందని అయితే ఈసినిమా కథకు సంబంధించిన కీలక భాగం అయిన సెకండ్ హాఫ్ లో అనీల్ రావిపూడి కొంతవరకు తడబడ్డాడు అంటూ గాసిప్పులు వస్తున్నాయి.

ఈమూవీ సెకండ్ హాఫ్ కు ప్రేక్షకులు కనెక్ట్ కాకపోతే ఈమూవీ అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవచ్చు అంటూ కొందరు సరికొత్త ప్రచారానికి తెర తీస్తున్నారు. అదేవిధంగా ‘అల వైకుంఠపురములో’ పరిస్థితి కూడ ఇదే అంటున్నారు. 

ఈమూవీ ఫస్ట్ హాఫ్ లో కథలో వచ్చే కీలక ట్విస్ట్ లు అన్నీ బయటపడిపోవడంతో ఈమూవీ సెకండ్ హాఫ్ అంతా త్రివిక్రమ్ మార్క్ కామెడీతో పాటుగా బన్నీ స్టైలిష్ యాక్షన్ సీక్వెన్సులతో నడిచి ఈమూవీ సెకండ్ హాఫ్ వచ్చే సరికి కథలో ట్విస్ట్ లు లోపిస్తాయి అని అంటున్నారు.  దీనితో ఈ రెండు సినిమాలకు సెకండాఫ్ కీలకంఅవుతుందని ఈ గండం గట్టెక్కినప్పుడు మాత్రమే ఈ రెండు సినిమాలు రికార్డులను క్రియేట్ చేస్తాయని లేకుంటే సంక్రాంతి హడావిడి తరువాత ఈ రెండు సినిమాల హవా తగ్గిపోయే ఆస్కారం ఉంది అంటూ ఒక కొత్త ప్రాచారం మొదలైంది..    

మరింత సమాచారం తెలుసుకోండి: