రాం గోపాల్ వర్మ ఈ పేరులోనే ఓ సంచలనం ఉంది. శివ సినిమాతో తెలుగు సినిమా దశ దిశ మార్చిన దర్శకుడు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే సినిమా కొందరు అంటే కాదు నాకు నచ్చినట్టు నేను తీస్తే మీకు ఇష్టం ఉంటే చూడండి లేదంటే పోండి అనే టైపు ఆర్జివి. అందుకే ఈ ప్రపంచమంతా ఒకవైపు ఆర్జివి ఒక వైపు అన్నట్టుగా ఆయన స్టేట్మెంట్స్ ఉంటాయి. ఒకరు మెచ్చినా.. ఒకరు తిట్టినా రెండిటికి ఒకే విధంగా స్పందించే ఆర్జివి ఈ దశాబ్ధలో సంచలనానికి కేంద్రం బిందువుగా మారాడు. ముఖ్యంగా ఏపి రాజకీయాల్లో ఆయన సినిమాలు కొత్త సంచలనం సృష్టించాయి.

 

తనదైన సినిమాలు చేస్తూ వచ్చే ఆర్జివి ఈ దశాబ్ధం మొదట్లోనే రక్త చరిత్ర అని పరిటాల రవి జీవిత కథతో సినిమా చేశాడు. ఆ సినిమా హిట్ అవడంతో రక్త చరిత్ర 2 అని కూడా తీసి మంచి ఫలితాన్ని అందుకున్నాడు. ఈ ఇయర్ తీసిన రెండు సినిమాలు లక్ష్మీస్ ఎన్.టి.ఆర్, అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు రెండు హాట్ టాపిక్ గా మారాయి. సినిమాను సైలెంట్ తీసి ప్రమోషన్స్ మాత్రం పీక్స్ లో చేసే ఆర్జివి ఈ రెండు సినిమాలతో మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. ముఖ్యంగా ఎన్.టి.ఆర్ జీవిత చివరి దశలో జరిగిన కథాంశంతో తీసిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్. జగన్ సిఎం అయ్యాక ఏపిలో కొందరి ఆలోచన గురించి అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలు చేశాడు. 

 

ఈ రెండు సినిమాలు ఎనౌన్స్ చేసిన దగ్గర నుండి రిలీజ్ అయ్యే వరకు ఎన్నో గొడవలు.. వివాదాలు సృష్టించాయి. ఎన్ని వివాదాలొచ్చినా సరే ఏమాత్రం భయపడకుండా సినిమాలు రిలీజ్ చేసి తన సత్తా చాటాడు వర్మ. ఇక ఈ దశాబ్ధంలో వంగవీటి అనే సినిమా కూడా తీశాడు ఆర్జివి. వంగవీటి రంగ జీవిత కథతో తీసిన ఆ సినిమా కూడా ఎన్నో వివాదాలను సృష్టించింది. 

 

2016లో ఆర్జివి వీరప్పన్ సినిమా చేశాడు. వీరప్పన్ జీవిత కథతో తీసిన ఆ సినిమాతో ఆర్జివి మరోసారి తన దర్శకత్వ ప్రతిభ చాటుకున్నాడు. నిత్య మీడియాలో ఉంటూ తను ఏ సినిమా చేసినా.. తీసింది ఒకటైతే ప్రమోషన్ వేరేలా చేస్తూ వచ్చే ఆర్జివి. నిజంగా గట్సున్నోడే అంటూ కొందరు ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారు. ఈ దశాబ్ధపు కాంట్రవర్సీ కింగ్ కంగ్ అంటే అది ఆర్జివినే అని చెప్పొచ్చు. లేటెస్ట్ గా ఎంటర్ ది లేడీ డ్రాగన్ అంటూ భారతీయ సినిమ చరిత్రలో మొదటి మార్షల్ ఆర్ట్స్ సినిమా చేస్తున్నాడు వర్మ. ఈమధ్య వచ్చిన ఆ సినిమా ట్రైలర్ లో లీడ్ క్యారక్టర్ చూపించే మార్షల్ ఆర్ట్స్ ప్రతిభ కన్నా ఎక్స్ పోజింగ్ ఎక్కువైందన్న కామెంట్స్ వస్తున్నాయి.

.

మరింత సమాచారం తెలుసుకోండి: