తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ స్థాయికి తిసుకెళ్ళిన చిత్రం "బాహుబలి". అప్పటి వరకు తెలుగు సినిమా వందకోట్లు చేరడానికే కష్టాలు పడుతోంటే అమాంతం రెండు వేల కోట్లకి తీసుకెళ్ళి అందరినీ విస్మయానికి గురి చేశాడు. తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమాని మరో స్థాయికి తిసుకెళ్ళిన ఘనత బాహుబలికే దక్కుతుంది. అయితే బాహుబలి తర్వాతే ఇండియాలో పాన్ ఇండియా సినిమాలు తెరక్కుతున్నాయి.

 

 

థగ్స్ ఆఫ్ హిందుస్తాన్, పానిపట్, మమాంగం లాంటి భారీ చిత్రాలన్నీ బాహుబలి స్ఫూర్తితో తెరకెక్కినవే. ఒక్క తెలుగులోనే బాహుబలి స్ఫూర్తితోనే సైరా, సాహో లాంటి సినిమాలు తెరకెక్కాయి. అయితే ప్రస్తుతం తెలుగులో మరో సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనుంది. గుణ శేఖర్ దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా "హిరణ్య కశిప" అనే చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ చిత్రం కోసం గత రెండేళ్లుగా ప్రీప్రొడక్షన్ వర్క్ అమెరికా- హైదరాబాద్ సహా పలు చోట్ల జరుగుతోంది.

 

దర్శకుడు గుణశేఖర్ `రుద్రమదేవి` తరువాత ఈ చిత్ర ప్రీప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెట్టారు. ఈసారి ప్రొడక్షన్ డిజైన్ పరంగా సుదీర్ఘ సమయం తీసుకుని ప్రతిదీ పక్కాగా ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ ప్రాసెస్ ని పక్కాగా ప్లాన్ చేసుకుని ఏమాత్రం తేడా లేకుండా, పక్కాగా ప్లాన్ చేసుకుంటూ బడ్జెట్ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా నిర్మించనున్నారట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి హాలీవుడ్ టెక్నిషియన్స్ తో చర్చలు జరుపుతున్నారట.

 


మొత్తానికి ఈ సినిమా మరో బాహుబలి రేంజ్ లో తెరకెక్కుతోందని తెలుస్తుంది. బాహుబలి ద్వారా రానా సంపాదించుకున్న క్రేజ్ ఈ సినిమాకి ఎంతో ఉపయోగపడుతుంది. ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ సహా మరిన్ని భాషల్లో విడుదల చేయాలని చూస్తున్నారు.  మరి ఈ చిత్రమైనా బాహుబలి  రేంజ్ ని అందుకుంటుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: