ఏదైనా సరే ఒక సినిమా నిర్మాణం జరుపుకోవాలి అంటే కథ, కథనంతో పాటు ఆ సినిమాకు డబ్బులు పెట్టె నిర్మాత కావాలి.  నిర్మాత లేకుంటే సినిమా నిర్మాణం జరగదు.  నిర్మాత అంటే కేవలం డబ్బులు పెట్టె ఒక మిషన్ కాదు.  అభిరుచి కలిగి ఉండాలి.  ఈ కథతో సినిమా తీస్తే సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉండాలి.  ఆ నమ్మకం ఉంటేనే సినిమాలు తీయగలుగుతారు. డబ్బులు మాత్రమే పెట్టి కథ గురించి పట్టించుకోకుంటే మాత్రం సినిమా ఫెయిల్ అవుతుంది.  తరువాత తిరిగి వెనక్కి చూసికుంటే ఏమి మిగలదు.  


అందుకే ఒక సినిమా కథను ఒకే చేసే ముందు ఒకటికి నాలుగుసార్లు అలోచించి నిర్ణయం తీసుకోవాలి.  ఎందుకంటే, ఒక్కసారి అడుగు ముందుకేసి సినిమాలో డబ్బు పెడితే ఏదైనా తేడా వస్తే నిండా మునిగిపోయేది నిర్మాత మాత్రమే కాబట్టి ఈ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.  అందుకే నిర్మాతలు అలోచించి అడుగు వేయాల్సి వస్తుంది.  ఇక 2010 నుంచి ఇప్పటి వరకు పదేళ్ల కాలంలో ఎన్నో సినిమాలు వచ్చాయి.  


ఎందరో కొత్త కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి వచ్చారు. సినిమాలు నిర్మించారు.  పదుల సంఖ్యలో కొత్త నిర్మాతలు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు.  అయితే, అలా వచ్చి డబ్బులు పెట్టిన ప్రతి ఒక్కరు నిర్మాతలుగా ఎదగలేదు.  కొందరు మాత్రమే ఈ ఇండస్ట్రీలో నిలబడ్డారు.  వారిలో దిల్ రాజు, సురేష్ బాబు, హారిక అండ్ హాసిని నిర్మాత రాధాకృష్ణ, బాహుబలి నిర్మాతలు, డివివి దానయ్య, గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్,  అశ్విని దత్ సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబుతో పాటుగా మహేష్ బాబు, రామ్ చరణ్ లు కూడా నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మిస్తున్నారు.  


వీరే కాకుండా ఇంకా చాలామంది నిర్మాతలు ఈ పదేళ్ల కాలంలో సినిమాలు నిర్మించారు.  అయితే, ఒకటి రెండు సినిమాలకే పరిమితం అయ్యి ఇండస్ట్రీ నుంచి తప్పుకున్నారు.  కొందరు మాత్రం సినిమా ఇండస్ట్రీలో నిలబడినా రిస్క్ ఎందుకు అని చెప్పి పక్కకు తప్పుకుంటున్నారు.  సినిమా ఇండస్ట్రీలో సినిమాను ప్యాషన్ గా తీసుకొని సినిమాలు నిర్మించేవాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో నిలబడుతున్నారు.  లేదంటే మాత్రం ఇండస్ట్రీలో నిలబడటం కష్టం అని చెప్పొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: