మెగా బ్రదర్ నాగబాబు నటుడు నిర్మాత బుల్లితెర కార్యక్రమాల జడ్జి అన్న విషయం అందరికీ తెలుసు. ముఖ్యంగా మెగా అభిమానులకు నిరంతరం అందుబాటులో ఉంటూ చిరంజీవి పవన్ ల ఇమేజ్ పెంచడానికి నాగబాబు గతంలో చాల కృషి చేసాడు. 

చిరంజీవి ‘ప్రజారాజ్యం’ పెట్టిన సమయంలో ఈమధ్యన జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో ‘జనసేన’ కోసం నాగబాబు చాల కష్టపడ్డాడు. అటువంటి నాగబాబు గురించి నిన్న ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ అనేక ఎవరికీ తెలియని ఆసక్తికర విషయాలు లీక్ చేసి మెగా అభిమానులకు కూడ షాక్ ఇచ్చాడు. 

నాగబాబు మంచి చిత్రకారుడు మాత్రమే కాకుండా వేణువు బాగా వైస్తాడట. అంతేకాదు ధ్యానం యోగాలతో పాటు నేచురోపతి విషయాలలో కూడ నాగబాబుకు మంచి ప్రావీణ్యం ఉంది అన్న విషయాన్ని పవన్ బయటపెట్టాడు. అంతేకాదు తనకు అనేకమంది విప్లవకారుల జీవితాలకు సంబంధించిన పుస్తకాలను తనకు ఇచ్చి తనలో విప్లవ భావాలు పెరిగేలా తనకు నాగబాబు స్పూర్తిని ఇచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 

ఇదే సందర్భంలో పవన్ మరొక ట్విస్ట్ ఇస్తూ తనకు ‘వీరసావర్కర్’ జీవితానికి సంబంధించిన పుస్తకం తనకు ఇచ్చిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ కాషాయ రంగులోని ఆ పుస్తకం తనకు ఇప్పటికీ ఎంతో ఇష్టం అంటూ పవన్ తనకు కాషాయ రంగు అన్నా కాషాయ రంగు పార్టీ అన్నా తనకు ఇష్టం అన్న విషయాన్ని పరోక్షంగా తెలియచేసాడు. అంతేకాదు నాగాబాబులో మంచి స్టోరీ టెల్లర్ ఉన్నాడు అని చెపుతున్న పవన్ నాగబాబు ఒక సినిమాను చూసినట్లుగా ఒక కథను కళ్ళకు కట్టేడట్లుగా చెపుతాడు అంటూ తన అన్న నాగబాబు పై ప్రశంసలు కురిపించడమే కాకుండా తన అన్న ప్రభావంతోనే తాను అనేక వేల పుస్తకాలు చదవగలిగాను అని అంటున్నాడు. ఇప్పుడు నాగబాబు గురించి పవన్ చెప్పిన సీక్రెట్స్ మెగా అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: