ఆయన పేరు తలిస్తే ఒక పూనకం  ... ఏ సినిమా ఈవెంట్ లో అయిన ఆయన పేరు మార్మోగిపోతోంది. అభిమానులందరికీ ఆయనంటే కేవలం అభిమానమే కాదు అంతకు మించి. హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా  ఆయన తో సినిమాలు తీసేందుకు దర్శకనిర్మాతలు క్యూ కడుతుంటారు. అది ఆయన ఫాలోయింగ్. ఆయన ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీ లిఖించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో అదో తెలియని క్రేజ్ .. ఇక దర్శక నిర్మాతలకు కూడా పవర్ స్టార్ తో సినిమా తీయాలని డ్రీమ్ . దీంతో పవర్ స్టార్ కి వరుస అవకాశాలు వచ్చి పడుతున్నాయి. అయితే  సినిమాల్లో  టాప్ హీరో క్రేజ్ ఉన్నప్పటికీ పవర్ స్టార్  మాత్రం సినిమాలకు పుల్స్టాప్ పెట్టేసి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 

 

 

 

 సినిమాలను ఎంతో ప్రభావం చేసినట్లే రాజకీయాలను కూడా ఓ రేంజ్లో ప్రభావితం చేస్తారు అని అంతా అనుకున్నారు.  ఒకానొక సమయంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం పవన్ కళ్యాణ్ తో భేటీ కావడం.. పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాజకీయాల్లోనే కాదు అటు కేంద్రంలో కూడా కీలకంగా మారతారు అని అందరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు.  కానీ పవన్ కళ్యాణ్ కి అంతల వీరాభిమానులు  ఉన్నప్పటికీ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ కి ఓటు వెయ్యనీ  పరిస్థితి ఏర్పడింది అని  అందరూ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే 148 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన జనసేన ఒక్కటంటే ఒక్క సీటు  గెలుచుకోవడం... ఇక ఏకంగా జనసేనానీ పావాబ్  అయితే రెండు చోట్ల పోటీ చేసినప్పటికీ... ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయారు. ఇక ఇప్పుడు మళ్ళీ సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు  అంటూ వార్తలు వస్తున్నాయి.

 

 

 అయితే మళ్ళీ సినిమాల్లోకి పవన్ కళ్యాణ్ అడిగు  పెడుతున్నట్లు  వాళ్లు వీళ్లు చెప్పడమే తప్ప... పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడూ క్లారిటీ ఇచ్చింది లేదు. ఈ సినిమాపై ఇప్పటికి  నిజమా అబద్దమా అనే ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాల పరంగా వీరాభిమానులు ఉన్నారు అని గొప్పగా చెప్పుకోవడం తప్ప.. పవన్ కళ్యాణ్ సినీ కెరియర్ లో మాత్రం ఎక్కువగా హిట్లు లేవు. ఇక గబ్బర్ సింగ్ సినిమా విజయం తరువాత వచ్చిన సర్దార్ గబ్బర్సింగ్ కాటంరాయుడు అజ్ఞాతవాసి సినిమాలు ...బాక్సాఫీస్ దగ్గర అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి. 

 

 

 

 సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లో కూడా పవన్ కి చుక్కెదురు అవ్వడం తో పవన్ కల్యాణ్ కి రాజకీయాల్లో సినిమాల్లో క్రేజ్ తగ్గిపోతుంది ఊహాగానాలు కూడా వస్తున్నాయి . ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన జనసేన పార్టీకి ఒక్కటంటే ఒక్క ఎమ్మెల్యే గెలిచి జనసేనాని సైతం రెండు చోట్ల ఓడిపోవడం... జనసేన సోలో  ఎమ్మెల్యే కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పైన విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే... పవన్ కళ్యాణ్ కు క్రేజ్  తగ్గిపోతుంది అని అర్థమవుతుంది. మరోవైపు పవన్ వయసు కూడా పెరిగిపోతుండటం తో సినిమాలకు చాలా సమయం గ్యాప్ రావటం ... అటు రాజకీయల్లో సత్తా చాటకపోవటం వెరసి    పవన్ కళ్యాణ్ కి క్రేజ్  ఇంకాస్త తగ్గిపోతూనట్లు కనిపిస్తుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: