టాలీవుడ్లో హీరోగా ఎంట్రి ఇచ్చి, మాస్ ప్యామిలి ఎంటర్టైనర్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు హీరో రామ్. రామ్ నటించిన మూవీలలో కొన్ని సక్సెస్‌లు సాధించి, నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టడంతో, తనకు మంచి పేరునే క్రియోట్ చేశాయి. ఇదిలా ఉంటే కందిరీగ మూవీతో రామ్ రెమ్యునరేషన్ జెట్ స్పీడ్ అందుకుంది. అప్పటి వరకూ రెండు నుండి మూడు కోట్ల వరకూ తీసుకుంటున్న రామ్, కందిరీగ మూవీ తరువాత ఏకంగా నాలుగు కోట్ల రూపాయలను డిమాండ్ చేస్తున్నాడు.
మూవీ బాగుంటే, అలాగే బంపర్ హిట్‌ను కొట్టిందంటే రామ్‌కు ఇస్తున్న నాలుగు కోట్ల రూపాయలు, నిర్మాతలకు పెద్ద లేక్కేమి కాదు. అదే విధంగా రామ్ నాలుగు కోట్ల రూపాయలను డిమాండ్ చేసి, ఎందుకంటే ప్రేమంటే, ఒంగోలు గిత్త లాంటి మూవీల్లో నటించాడు. అయితే ఆ మూవీలు అన్నీ బాక్సాపీస్ వద్ద బొక్కబోర్లా పడటంతో, ఆ మూవీ డిస్ట్రిబ్యూటర్లు నష్టాలను చవిచూసినట్టు ట్రేడ్స్ లెక్కలు చెబుతున్నాయి. నిర్మాతలు కూడ కొద్ది పాటి నష్టాలతో బతికిపోయారని టాలీవుడ్ రిపోర్ట్.
రీసెంట్గా రామ్‌కు అంత మార్కెట్ లేనప్పటికి, తగ్గేది లేదంటున్నాడు . మనోడి రేటును చూసి నిర్మాతలు ఆ దరిదాపుల్లోకి కూడ రావడంలేదు. ఏదేమైనా రామ్‌తో మూవీ చేయటానికి చాలా మంది నిర్మాతలు రెడీగా ఉన్నప్పటి, ఇతగాడు చెప్పే రేట్లకే కొంచెం దూరంగా ఉంటే బెటర్ అని లైట్ తీసుకుంటున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: