టాలీవుడ్ లో సెన్సేషన్ హీరోగా పేరు తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ.  తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్ళిచూపులు’ సినిమాతో మంచి విజయం అందుకున్న విజయ్ దేవరకొండ తర్వాత సందీప్ వంగా దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ మూవీతో దేశ వ్యాప్తంగా అందరి చూపు తనవైపు తిప్పుకున్నాడు.  బాలీవుడ్ హీరోయిన్లు సైతం విజయ్ దేవరకొండ లాంటి హీరోతో నటించేందుకు ఉత్సాహం చూపించారు. ఈ మూవీ బాలీవుడ్, కోలీవుడ్ లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. అర్జున్ రెడ్డి లాంటి సెన్సేషన్ మూవీ తర్వాత పరుశరామ్ దర్శకత్వంలో ‘గీతాగోవిందం’ అనే ఫ్యామిలీ ఎంట్రటైన్ మెంట్ లో నటించాడు.  

 

అర్జున్ రెడ్డిలో ఎంత అగ్రెసీవ్ గా కపిపించిన విజయ్ దేవరకొండ ‘గీతాగోవిందం’ లో కడుపుబ్బా నవ్వించే పాత్రలో కనిపించాడు.  ఎలాంటి వేరియేషన్స్ అయినా తాను చేయగలనని నిరూపించాడు. ఆ తర్వాత టాక్సీవాలాతో మరో విజయాన్ని అందుకున్నాడు.  ఈ ఏడాది ‘డీయర్ కామ్రేడ్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.  కానీ ఈ మూవీ అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేక పోయింది. తాజాగా క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ మూవీలో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. అయితే ఈ మూవీ గురించి మొన్నటి వరకు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు.

 

ఇప్పుడు వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి కారణంగా వెరైటీ ప్రమోషన్.. ఈ మూవీలో నాలుగు విభిన్నమైన ప్రేమ కథలు ఉండబోతున్నాయి.  నలుగురు హీరోయిన్స్‌ ఈ మూవీలో కనిపించబోతున్నారు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా నాలుగు ప్రేమ కథలు ఉండబోతున్నాయంటూ నాలుగు పోస్టర్స్‌ ద్వారా చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పకనే చెప్పారు. మొత్తానికి విజయ్ మూవీపై అప్పుడే అంచనాలు పెంచేస్తున్నారు.  తప్పకుండా సినిమా ఒక రేంజ్‌లో ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతుంది.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: