ఇప్పటి సినిమాల తీరు పూర్తిగా మారిపోయింది. గత పది సంవత్సరాల నుంచి అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు తీసే తీరు మారిపోయింది. కాసులు వస్తే చాలు ఎలాంటి సినిమా తీస్తున్నాం.. ఇలా తీస్తే ప్రజల మీద ఏమైనా ప్రభావం పడుతుందా  అని ఆలోచించే వారి సంఖ్య చాలా తక్కువగా అయిపోయిందని ప్రజలు భావిస్తున్నారు. భారి బడ్జెట్లతో స్టార్ హీరోల సినిమాలు తీస్తున్నారు తప్ప ఆ సినిమాలో ఎక్కడా విలువల మాటే లేదు అని  నేటి ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇప్పుడు వస్తున్న సినిమాలన్నీ ప్రేక్షకుల మీద భారీ ప్రభావాన్ని చూపిస్తున్నాయి. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిస్తే చాలా తాము తీసే సినిమాలు మానవతా విలువలు ఉన్నాయా లేవా అన్నది కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ఈ రోజుల్లో

 

 

 

 ఒకప్పుడు సినిమాల్లో అయితే సినిమాల్లోని ప్రతి పాటకి ఒక మంచి అర్థం ఉండేది.. సినిమాల్లోని ప్రతి సీన్ కి ఒక పరమార్థం ఉండేది.. కానీ ఇప్పటి సినిమాల్లో మాత్రం అలాంటిది మచ్చుకైనా కనిపించడం లేదు అంటే అతిశయోక్తి కాదు. సినిమాలు తీశామా రిలీజ్ చేశామా  భారీగా వసూళ్లు రాబట్టామా  ఇంతకుమించి దర్శక నిర్మాతలు ఏమి ఆలోచించడం లేదని ప్రజలు అనుకుంటున్న మాట. అటు  ప్రేక్షకుడి ఆలోచనా తీరు కూడా ఇలాగే మారిపోయింది. సినిమాలు విలువలు ఎందుకు దండగ యాక్షన్ సీన్స్ ఉండదుగా  అనుకుంటున్నారు సగటు ప్రేక్షకుడు. ఇక కొంతమంది మానవతా విలువలతో సినిమాలు తీసినప్పటికీ వారికి ప్రేక్షకుల నుంచి చేదు అనుభవం ఎదురవుతుంది.దీంతో  వాళ్లు కూడా ఇలాంటి సినిమాలకి కాలు దువ్వుతున్నారు. 

 

 

 ఇప్పటి కాలంలో.. అసలు విలువలు ఉన్న మంచి సినిమాలే లేవా అంటారా.. ఎందుకు లేవండి అప్పుడప్పుడు విలువలను గుర్తుచేస్తూ.. కొన్ని  సినిమాలు  తెరమీదికి వస్తూనే ఉంటాయి. వాటికి ప్రేక్షకాదరణ కూడా బాగానే లభిస్తూ ఉంటుంది. అందుకే కొన్ని కొన్ని సార్లు చిన్న సినిమాలు కూడా భారీ విజయాలను సాధిస్తూ ఉంటాయి. ఇక టాలీవుడ్ లో పది సంవత్సరాలకు ముందు సినిమాలు ఇప్పటి సినిమాలను కూడా పోల్చి చూస్తే ఎన్నో  మార్పులు చేర్పులు కనిపిస్తాయి. అయితే ఇప్పుడు ఎక్కువ సినిమాల్లో వల్గర్  సీన్లే ఎక్కువ కనిపిస్తున్నాయి... ఇలాంటి సీన్లు లేకపోతే అసలు సినిమా హిట్ అవుతున్నాయా  అన్నది కూడా డౌటే. ప్రతి సినిమాలు హాట్ సీన్లు ఉంటేనే సినిమాను చూడటానికి కూడా అభిమానుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైన ఇప్పటి సినిమాల్లో మాత్రం విలువ మాట ఎక్కడ వినపడటం లేదు క్షణక్షణం కాసుల  కనిపిస్తుంది టాలీవుడ్లో.

మరింత సమాచారం తెలుసుకోండి: