సినీ పరిశ్రమ అంటేనే రంగు రంగుల ప్రపంచం. ఈ రంగుల లోకంలో హీరోయిన్లుగా రాణించాలని ఎందరో ఆశపడి సినీ రంగానికి వస్తూంటారు. కానీ.. కొందరు మోసగాళ్ల వలలో పడి మోసపోతూంటారు. హీరోయిన్లు కావాలనే వారి ఆశ తీరకపోగా ప్రమాదకరమైన ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. కొత్తగా వచ్చేవారు మాత్రమే కాకుండా హీరోయిన్లుగా చేసిన వారు కూడా ఈ రొంపిలోకి దిగిపోతూంటారు. ఈ దశబ్దంలో అలాంటి ఉదంతాలెన్నో టాలీవుడ్ లో జరిగాయి.

 

 

ముఖ్యంగా టాలీవుడ్ ని కుదిపేసిన అంశాల్లో ముఖ్యమైనవి శ్వేతాబసు, శ్రీరెడ్డి, చికాగో వ్యభిచార రాకెట్లు. మంచి హీరోయిన్ గా రాణిస్తున్న శ్వేతాబసు పలు హిట్ సినిమాల్లో నటించి ఈ రొంపిలోకి దిగి కెరీర్ పాడు చేసుకుంది. ఇక శ్రీరెడ్డి ఇష్యూ అయితే తెలుగు సినీ పరిశ్రమను ఓ కుదుపు కుదిపేసింది. అమెతోపాటు ఎంతో మంది హీరోయిన్లు కావాలనుకుంటే కొందరు తమను వాడుకుని వదిలేశారని ఆరోపణలు చేసింది. ఆమె చెప్పిన పేర్లలో దగ్గుబాటి అభిరామ్, విశాల్, ఉదయనిధి స్టాలిన్, నాని.. ఇలా ఆరోపణలతో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఉదంతంతో టాలీవుడ్  లో అసలేం జరుగుతోంది.. అనే ఆలోచన వచ్చేలా చేసింది. హీరోయిన్లు కావాలంటే ఇలాంటి పనులు చేయాలా అనే ఆలోచన వరకూ తీసుకెళ్లింది. ఇక చికాగో సెక్స్ రాకెట్ అయితే టాలీవుడ్ హీరోయిన్లు, యాంకర్లు పేర్లు హల్ చల్ చేశాయి. ఈవెంట్ షోకు అమెరికా వెళ్లే వాళ్ళని మభ్యపెట్టి కిషన్-చంద్ర అనే దంపతులు ఈ రొంపిలోకి లాగడం తీవ్ర సంచలనం రేపింది. ప్రస్తుతం ఈ కేసు అక్కడి కోర్టులో ఉంది.

 

 

వీరే కాదు.. ఎంతో మంది సీనియర్ నటీమణులు గతంలో ఈ కూపంలోకి దిగిన ఉదంతాలు ఉన్నాయి. వారంతా పలుమార్లు ఈ ఉచ్చులో ఉంటూ వెలుగులోకి వచ్చినవారే. ఇలాంటి సంఘటనలతో సినిమా పరిశ్రమపై ఉన్న అభిప్రాయం సన్నగిల్లడమే కాకుండా చెడు అభిప్రాయం కూడా ఏర్పడుతుంది. మొత్తానికి ఇటువంటి అంశాలు ఈ దశబ్దంలో టాలీవుడ్ ప్రతిష్టను మసకబార్చాయనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: