టాలీవుడ్ సినిమా పరిశ్రమలో గడిచిన ఈ పదేళ్లలో అనేక సరికొత్త మార్పులు చోటు చేసుకోవడంతో పాటు సినీ ఇండస్ట్రీ టెక్నీకల్ గా కూడా ఎంతో అభివృద్ధి చెందింది. అలానే రాను రాను ఇండస్ట్రీ కి ఎక్కువగా కొత్త నీరు రాక కూడా పెరిగిందనే చెప్పాలి. ఎప్పటికప్పుడు యువ దర్శకుల రంగప్రవేశం కూడా జరుగుతూ, సరికొత్త తరహా సినిమాలు కూడా వస్తున్నాయి. కాగా ఈ గడిచిన 2010-2020 సమయంలో దర్శక ధీరోదాత్తులుగా ఎవరు నిలిచారో ఇప్పుడు చూద్దాం. ముందుగా టాలీవుడ్ సినిమా పరిశ్రమలో దర్శక ధీరుడుగా పేరుగాంచిన ఎస్ ఎస్ రాజమౌళి 2010లో మర్యాద రామన్న, 2012లో ఈగ, 2015లో బాహుబలి, 2017లో బాహుబలి 2 సినిమాలు తెరకెక్కించారు. కాగా వాటిలో అన్ని సినిమాలు సూపర్ హిట్ కొట్టగా, 

 

అందులో బాహుబలి రెండు భాగాలు కూడా ఎంతో అత్యద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమా ఖ్యాతిని ఉన్నత శిఖరాలకు చేర్చడం జరిగింది. మరొక దర్శకుడైన కొరటాల శివ 2013లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ మిర్చి తో దర్శకుడిగా మారారు. కొరటాల శివ, ఆ తరువాత శ్రీమంతుడు, జనతా బ్యారేజి, భరత్ అనే నేను సినిమాలు తీసి, వరుసగా అన్ని సినిమాలతో అత్యద్భుత విజయాలు అందుకున్నారు. ఇక మరొక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, 2010లో మహేష్ తో ఆయన తీసిన ఖలేజా ఫ్లాప్ అయినప్పటికీ, క్రిటిక్స్ నుండి కూడా ప్రశంసలను ఆ సినిమా అందుకుంది. ఆ తరువాత 2012లో జులాయి, 2013లో అత్తారింటికి దారేది, 2015లో సన్ ఆఫ్ సత్యమూర్తి, 2016 లో అఆ సినిమాలతో వరుసగా మంచి సక్సెస్ లు అందుకున్న త్రివిక్రమ్

 

2018లో ద్వితీయార్ధంలో అరవింద సమేతతో మరొక హిట్ సొంతం చేసుకున్నారు. వారి తరువాత 2015లో కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన పటాస్ సినిమాత్ టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి, తొలి సినిమాతో పాటు ఆ తరువాత తీసిన సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 వంటి సినిమాలతో వరుసగా అన్నీ విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇక 2010లో రానా హీరోగా తెరకెక్కిన లీడర్ సినిమాతో మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్న శేఖర్ కమ్ముల, తరువాత 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తో యావరేజ్ విజయాన్ని మరియు 2017లో ఫిదా సినిమాతో అత్యద్భుత విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. 2007లో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మున్నా సినిమాతో టాలీవుడ్ కి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన వంశీ పైడిపల్లి

 

ఫస్ట్ సినిమాతో పర్వాలేదనిపించినప్పటికీ, 2010లో ఎన్టీఆర్ తో బృందావనం, 2014లో రామ్ చరణ్ తో ఎవడు, 2016లో నాగార్జున, కార్తీల ఊపిరి, 2019లో సూపర్ స్టార్ మహేష్ బాబు తో మహర్షి సినిమాలు తీసి అత్యద్భుత విజయాలు అందుకున్నారు. మాస్ దర్శకుడిగా పేరుగాంచిన బోయపాటి శ్రీను 2010లో బాలకృష్ణతో సింహ, 2014లో మళ్ళి బాలయ్యతోనే లెజెండ్, 2016లో అల్లు అర్జున్ తో సరైనోడు సినెమాలతో బోయపాటి సూపర్ హిట్స్ సొంతం చేసుకున్నారు. ఒకకరంగా వీరే ఈ దశాబ్దపు అత్యుత్తమ దర్శకులు అని చెప్పుకోవాలి.....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: