ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో కుర్ర హీరోల హవా కొనసాగుతోంది. దీంతో సీనియర్ హీరోల క్రేజ్ రోజు రోజుకి తగ్గిపోతుంది. ఇదే తరుణంలో సినిమా చూసే ప్రేక్షకుడికి ధోరణి కూడా మారింది. ఒకానొక సమయంలో సినిమా హీరో బట్టి సినిమా హాల్ లోకి వచ్చే ప్రేక్షకులు ఉండగా ప్రస్తుతం సినిమా కంటెంట్ మరియు హీరో క్యారెక్టర్ బాగుంటేనే సినిమాకి వస్తున్నారు. అంతేకాకుండా వయస్సుకు తగ్గ పాత్రలతో నటించే హీరోలకు సినిమా ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటించిన 'మన్మథుడు 2' ఆరు పదుల వయసులో వచ్చి ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు అని సినీ విశ్లేషకులు అప్పట్లో కామెంట్ చేశారు... సినిమా చూసిన చాలా మంది ఇటువంటి టైం లో అటువంటి స్టోరీ నాగార్జున గారికి యాప్ట్ కాలేదని సోషల్ మీడియాలో కామెంట్ చేసిన సందర్భాలు ఉన్నాయి.

 

మరోపక్క విక్టరీ వెంకటేష్ అయితే యంగ్ హీరోలకు సపోర్టు పాత్రలు చేస్తూ చాలా తెలివిగా మల్టీస్టారర్ ఫార్ములాని నమ్ముకుని కెరియర్ ని రాణిస్తున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి విషయానికొస్తే తనకు తగ్గ పాత్రలు సొంత బ్యానర్లోనే చేసుకుంటూ పర్వాలేదు అని పిలుస్తున్నారు. ఇటువంటి తరుణంలో బాలకృష్ణ విషయానికొస్తే ఆయన ఫ్యాన్స్ కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నట్లు ఇండస్ట్రీలో మరియు సోషల్ మీడియాలో వార్తలు కామెంట్లు గట్టిగా వినబడుతున్నాయి. విషయంలోకి వెళితే ఎప్పటినుండో బాలయ్య బాబు తన వేరియేషన్ సినిమాలో చూపించడం లేదని తనతో పాటు ఇండస్ట్రీలో ఉన్న తోటి సీనియర్ హీరోలు వేరియేషన్ చూపించిన బాలయ్య బాబు పాతదనాన్ని అటువంటి నటననే ప్రతి సినిమాలో చూపిస్తున్నారని దీంతో బాలయ్య బాబు అభిమానులు భవిష్యత్తులో చేయబోయే సినిమాల విషయంలో దయచేసి కొత్తదనంగా ఆలోచించి సినిమాలు చేయండి మీ కాళ్లు పట్టుకుంటాము బాలయ్య బాబు అంటూ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్నారు.

 

ప్రస్తుతం కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన 'రూలర్' సినిమా విడుదలవుతున్న క్రమంలో సినిమా టీజర్ లో …. ఎప్పటినుండో నటిస్తున్న నటన అదే డైలాగ్ డెలివరీ బాలయ్య బాబు అనుసరించినట్లు అర్థమవుతుందని సినిమాపై బాలయ్య బాబు అభిమానులు కామెంట్ చేస్తున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: