ప్రజలకు వినోదాన్ని పంచె సినిమా రంగం క్రమంగా రంగులు మార్చుకొని వ్యాపార రంగంగా మారింది. వస్తున్న మార్పులకు అనుగుణంగా సినిమా మారిపోవడంతో పాటు, హీరోల తాలూకు ఇమేజ్ లను దృష్టిలో పెట్టుకొని సినిమాలు తీయాల్సి వస్తోంది.  దీంతో సినిమా రంగంలో పెట్టుబడులు ఎక్కువగా పెట్టాల్సి వస్తోంది.  మేకింగ్ ఖర్చు, రెమ్యునరేషన్ మొత్తం కలుపుకొని సినిమాకు బడ్జెట్ తడిసిమోపెడు అవుతోంది.  


పోనీ భారీ ఖర్చు పెట్టి సినిమా తీస్తే.. సినిమా తప్పకుండా హిట్ అవుతుందా అంటే ఏమో చెప్పలేం.  ఎందుకంటే సినిమా తీయడం వరకే దర్శక నిర్మాతల పని, ఆకట్టుకుంటే హిట్ అవుతుంది.  లేదంటే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతోంది.  చెప్పలేని పరిస్థితి.  అందుకే సినిమా విషయంలో నిర్మాతలు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.  ఏ సినిమా ఎప్పుడు హిట్ అవుతుందో చెప్పలేని పరిస్థితి.  


కోట్లాది రూపాయల బడ్జెట్ పెట్టి తీసిన సినిమా ఒక్కోసారి హిట్ కాకపోవచ్చు.  ప్రజలకు నచ్చకపోవచ్చు.  అలా నచ్చకుంటే ఇంకేముంది భారీ ప్లాప్.  పాపం నిర్మాత మునిగిపోతాడు.  మరో సినిమా చేయడానికి డబ్బులు ఉంటె చేస్తాడు.  లేదంటే అప్పులు చేసి సినిమా చేయాల్సి వస్తుంది. సినిమా రంగంలో నిర్మాతగా ఒక్కసారిగా అడుగుపెట్టిన తరువాత దాదాపుగా సినిమా తప్పించి మరేమి చేయాలని పరిస్థితి.  అందుకే నిర్మాతగా మారే ముందు ఆలోచిస్తుంటారు.  


ఇలా హీరోగా హ్యాపీగా సినిమాలు చేస్తున్న బాలకృష్ణ నిర్మాతగా మారి ఎన్టీఆర్ బయోపిక్ సినిమా తీశారు.  చాలా వరకు నష్టపోవాల్సి వచ్చింది.  ఆ తరువాత సొంత నిర్మాణ రంగాన్ని పక్కన పెట్టి బయట సినిమాలు చేయడం మొదలుపెట్టాడు.  నిర్మాతగా ఎందుకు వచ్చిన రిస్క్ అని భయపడుతున్నారు.  రెగ్యులర్ గా సినిమాలు చేసే బడా నిర్మాతలు కూడా అప్పుడప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా హిట్టయినా దానికి తగిన డబ్బులు రాక పాపం ఇబ్బందులు పడుతున్నారు.  కారణం పైరసీ.  పైరసీ వలన సినిమా థియేటర్లకు వెళ్లకుండా ఇంట్లోనే కూర్చొని సినిమా చూస్తున్నారు.  ప్లాపైనా సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: