బాలయ్య సినిమా అంటే ఫ్యాన్స్ కు పండగే.. వయసు పెరుగుతున్నకోదీ బాలకృష్ణ లో ఎనర్జీ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ కుర్రహీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్న బాలయ్య రూటు మారిస్తే బెటరని కొందరు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. సినీ లోకం రోజు రోజుకు కొత్తపుంతలు తొక్కుతోంది. కొత్త డైరెక్టర్ లు సరికొత్త కథల తో ఇండస్ట్రీలో దూసుకుపోతున్నారు.

 

ఈ టైమ్ లో సీనియర్లుకు కొత్త కష్టాలు వచ్చిపడుతున్నాయి. కొత్త జనరేషన్ సినిమాలు వస్తున్న కాలంలో, నాగ్, వెంకీ, చిరు ఆచి తూచి సినిమాలు చేస్తుంటే బాలయ్య మాత్రం ఇంకా అదే స్టయిల్ సినిమాలు చేస్తున్నారు.సీనియర్ల సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి.అందుకు ఉదాహరణ కింగ్ నాగార్జున నటించిన మన్మధుడు2 సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూడా డిఫెరెంట్ కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు.

 

ఇక వెంకటేష్  ఇప్పటికే మల్టీస్టారర్ సినిమాలను నమ్ముకొని విజయాలు అందుకుంటున్నారు.ఇక బాలయ్య విషయానికి వస్తే బాలయ్య గౌతమీపుత్ర శాతకర్ణి తప్పితే మరో సినిమా శహభాష్ అనిపించుకున్నది ఇటీవలి కాలంలో లేదు.దాంతో బాలయ్య ఇప్పటికైనా స్టయిల్ మార్చితే బెటర్ అని కొందరు అభిమానులు అంటున్నారు. ఈసందర్భంలో  బాలయ్య లేటెస్ట్ సినిమా రూలర్ వస్తోంది. ఇప్పటి వరకు ఆ సినిమాకు సరైన బజ్ లేదు. అసలు వస్తోందన్న టాక్ లేదు.

 

అదే రోజు వస్తున్న ప్రతి రోజూ పండగే సినిమా పబ్లిసిటీ హల్ చల్ చేస్తోంది కానీ రూలర్ జాడ కనిపించడం లేదు. రూలర్ కోసం అప్పటికీ మళ్లీ రెండో ట్రయిలర్ కూడా వదిలారు. మొదటి ట్రయిలర్ కన్నా ఏమీ కొత్తగా లేదు. అదే ఫైట్లు, అవే డైలాగులు అన్నట్లుగా వుంది. ఇక బాలకృష్ణ,బోయపాటి కాంబినేషన్లో వచ్చే సినిమా ఎలా వుంటుందో ముందే ఊహించకోవచ్చు. కాబట్టి బాలయ్య ఇప్పటికైన రూట్ మరిస్తే బెటరేమో...

మరింత సమాచారం తెలుసుకోండి: