యూత్ లో బీభత్సమైన ఫాలోయింగ్ ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పదేళ్లలో కొత్త ప్రయత్నాలు చాలా చేశారు. 2014 వరకు కేవలం ఒక సినిమా హీరోగానే ఉన్న పవన్ కళ్యాణ్ 2014 మార్చ్ 14న జనసేన పార్టీని స్థాపించారు. తనకున్న యూత్ ఫాలోయింగ్ తో అన్న ప్రజారాజ్యం పార్టీలా కాకుండా తన పార్టీ సత్తా చాటుతుందని అనుకున్నాడు పవన్ కళ్యాణ్. పార్టీ ఎనౌన్స్ చేసి మొదటిసారి ఎలక్షన్స్ కు దూరంగా ఉంటూ సపోర్ట్ గా మాత్రమే ఇచ్చిన పవన్ 2019 లో మాత్రం ఎలక్షన్స్ లో నిలబడ్డారు. 

 

తను చేసే పార్టీ ప్రచారాలకు వచ్చే జనాలను చూసి ఇంకేముందు పొలిటికల్ గా తానో సంచలనం కానున్నాడని భావించిన పవన్ కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చారు ఆంధ్రా ప్రజలు. రెండు చోట్ల పోటీ చేసినా కనీసం అతన్ని ఒకచోట కూడా గెలిపించలేదు అంటే అతని మాటల ప్రభావం ప్రజల్లో ఎంతవర్కు ఉందో అర్ధం చేసుకోవచ్చు.

 

సినిమాల విషయానికి వస్తే 2010లో పులి అంటూ ఓ డిజాస్టర్ సినిమా చేశాడు పవన్ కళ్యాణ్. ఎస్.జె సూర్య డైరక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ కా బాప్ అనిపించింది. ఇక ఆ తర్వాత వచ్చిన తీన్మార్ కూడా దెబ్బవేసింద్. 2012లో మళ్లీ గబ్బర్ సింగ్ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు పవన్ కళ్యాణ్. బాలీవుడ్ మూవీ దబాంగ్ కు రీమేక్ గా వచ్చిన ఆ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యింది.

 

సినిమా తర్వాత త్రివిక్రం డైరక్షన్ లో వచ్చిన అత్తారింటికి దారేది సినిమా కూడా మంచి విజయం అందుకుంది. ఆ సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం లీకైనా సరే సినిమా సంచలన విజయం అందుకుంది. ఆ తర్వాత పవన్ నటించిన గోపాల గోపాల సోసోగానే ఆడగా కథ స్క్రీన్ ప్లే తానిచ్చి పేరుకి బాబిని డైరెక్టర్ గా చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం మళ్లీ చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఆ తర్వాత కాటమరాయుడు ఫ్లాప్ అవగా త్రివిక్రం తో చేసిన అజ్ఞాతవాసి కూడా నిరాశపరచింది. 

 

ఈ దశాబ్ధంలో పవర్ స్టార్ యూత్ లో ఇంకాస్త క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే రాజకీయాల్లో మాత్రం అతను ఆశించిన స్థాయిలో ప్రక్షాళన్ చేయలేకపోతున్నాడు. ఎలాగు ఘోరంగా ఓడిపోయాడు కాబట్టి ఇక సినిమాలే కొనసాగించాలనే ఆలోచనలో ఉన్నాడు పవన్. ఈమధ్యనే పింక్ రీమేక్ లో పవన్ నటిస్తున్నాడని వార్తలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: