ఈ సంవత్సరం సినిమా రంగం పరిస్దితి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉంది. ఎందుకంటే భారీ బడ్జెట్‌తో తీసిన సినిమాలు బోల్తా కొట్టగా చిన్న బడ్జెట్ సినిమాలు మాత్రం నిర్మాతలకు కాసుల వర్షాన్ని కురిపించాయి.. ఇదే కాకుండా పెద్ద హీరోని పెట్టి నలభై, యాభై కోట్ల పెట్టుబడి కాకుండా ఈ మద్యకాలంలో 100 కోట్ల పెట్టుబడితో తీసిన సినిమాలు కేవలం రెండు, మూడు కోట్లు లాభాలు చూస్తోన్న నిర్మాతలకు చిన్న చిత్రాలు బాసటగా నిలుస్తున్నాయి. తక్కువ బడ్జెట్ లో కొత్త వారితో సినిమాలు తీసి కోట్లలో లాభాలు దండుకుంటున్నారు నిర్మాతలు. కొన్ని చిన్న సినిమాలైతే పెద్ద సినిమాలతో పోటీ పడి మరీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టంచాయి.

 

 

గత సంవత్సరమే కాకుండా ఈ ఏడాదిలో కూడా అలా సక్సెస్ అందుకున్న చిన్న సినిమాలు చాలానే ఉన్నాయి.  ఇందులో కొన్ని సినిమాలను చూస్తే ఎఫ్ 2 - వెంకీ, వరుణ్ కలిసి నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల షేర్ సాధించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే కాకుండా యాత్ర - ఈ సినిమా ఏవరేజ్ గా ఆడినా నిర్మాతలకు లాభం తీసుకొచ్చింది. పెట్టిన పెట్టుబడి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.8 కోట్ల షేర్ సాధించింది. కళ్యాణ్ రామ్ నటించిన 118 కి చాలా రోజుల తరువాత హిట్ వచ్చింది. వరల్డ్ వైడ్ ఈ సినిమా రూ.11 కోట్ల షేర్ సాధించింది. అదీగాక అడల్ట్ కంటెంట్ తో వచ్చిన మూవీ చీకటి గదిలో చితక్కొట్టుడు - కలెక్షన్ల పరంగా ఈ చిన్న సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ.5 కోట్ల షేర్ రాబట్టింది. వరుస ఫ్లాప్ లతో డీలా పడ్డ సాయి తేజ్ చిత్రలహరి  సినిమాతో హిట్ అందుకున్నాడు.

 

 

టోటల్ గా ఈ సినిమా రూ.14.5 కోట్ల వసూళ్లు సాధించింది.. ఇలా పోతే గత దశాబ్ద కాలంగా చిన్న సినిమాలు తీసుకుని నష్టపోయిన నిర్మాతలు లేరనే చెప్పాలి. వారు పెట్టిన పెట్టు బడికి ఎంతో కొంత మిగిల్చుకున్నారే తప్పా రోడ్దున పడలేదు. ఇకపోతే కొన్ని చిన్న సినిమాల సంగతి తీసుకుంటే వీటి విజయాపజయాల సంగతి పక్కన పెడితే.. విడుదలతో డబ్బులు పెట్టిన నిర్మాతలకు కాస్త ఊరట లభించినట్లే. సినిమాలు విడుదలవడంతో అటు దర్శక, నిర్మాతలతో పాటు ఇటు ఆ చిత్రాలకు పనిచేసిన నటీనటులు, టెక్నీషియన్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నా సందర్భాలున్నాయి. అందుకే అన్ని రకాలుగా చిన్న సినిమాలు సేఫ్ సైడనే చెప్పాలి. ఆడకుంటే భారి నష్టం ఉండదు. ఒకవేళా సినిమా బాగా ఆడితే వచ్చే లాభాలకు ఢోకా ఉండదు..

మరింత సమాచారం తెలుసుకోండి: