రోత పుట్టించే కామెడీనే అసలు సిసలైన హాస్యం అనుకుని దానితోనే సంతృప్తి చెందుతున్న ఈనాటి యువ ప్రేక్షకులకు హాస్యం.. చమత్కారం లాంటి వాటి గురించి అసలు అర్ధం తెలియదనే చెప్పాలి. ఎదుటి వాడి అవలక్షణాన్ని దూషిస్తూ సెటైరికల్ గా మాట్లాడటమే ఈనాటి కామెడీ అంటుంటే అసలు ఎలాంటి బూతు.. రోత పదజాలం వాడకుండా ప్రేక్షకులను నవ్వించడమే ఒకప్పటి సినిమాల పని.. అందులోనే హాస్య బ్రహ్మగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న జంధ్యాల గారిది సెపరేట్ స్టైల్.         

 

ఆయన కథలోనే హాస్యం ఉంటుంది.. ఆయన మాటల్లోనూ హాస్యం ఉంటుంది.. సన్నివేశంలోనూ హాస్యం ఉంటుంది. ఆరోగ్యకరమైన హాస్యాన్ని ఇవ్వడంలో తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన ఓ బంగారం ఆయన.. అందుకే ఇప్పటికి ఆయన్ను ఇప్పటికి తలచుకుంటాం. హాస్యం మాత్రమే కాదు హృదయాలను తాకే భావాలను ఆయన పెన్ను నుండి వచ్చాయి. నిజంగా చెప్పాలంటే సినిమాలో ఎంతోకొంత విజ్ఞానాన్ని ఇవాలన్న అలనాటి దర్శకులలో జంధ్యాల ఒకరని చెప్పొచ్చు.       

 

అయితే కాలం మారింది.. ఈ దశాబ్ధంలో కూడా కామెడీ సినిమాలు వచ్చాయి. కాని కొన్ని కథలో కామెడీనికి మిక్స్ చేసి సినిమాగా తీస్తే.. కేవలం కామెడీని బేస్ చేస్తూ కొన్ని సినిమాలు వచ్చాయి. కామెడీ అంటూ కొన్ని సినిమాలు పరిధి దాటేస్తున్నా..  మరికొన్ని మాత్రం జంధ్యాల స్పూర్తితో మనసుని మెప్పించే ఉల్లాసబరితమైన సినిమాలు చేస్తున్నారు. ఎన్ని చేసినా ఎన్ని వచ్చినా ఈ దశాబ్ధంలో కూడా జంధ్యాల కొరత తీర్చే దర్శకుడు రాలేదని చెప్పొచ్చు.

 

ఇక ఈమధ్యనే దర్శకుడు అనీల్ రావిప్పుడి ఎంటర్టైనింగ్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. పటాస్ నుండి ఎఫ్-2 వరకు వరుస హిట్లతో కామెడీ సినిమాలు చేస్తున్న అనీల్ రావిపుడి సినిమాలు కొంతమేరకు ప్రేక్షకులను జంధ్యాల చాతుర్యాన్ని.. చమత్కారాన్ని గుర్తు చేస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: