టాలీవుడ్ సినిమా పరిశ్రమలో గడిచిన ఈ పదేళ్లలో అనేక సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. సినీ ఇండస్ట్రీ టెక్నీకల్ గా ఎంతో అభివృద్ధి చెందింది. సరికొత్త తరహా సినిమాలు ఎన్నో వస్తున్నాయి. వచ్చిన అన్ని సినిమాల్లో కొన్ని మాత్రం ప్రపంచానికి మన తెలుగు సినిమా పవర్ ను చుపిస్తున్నాయి. ఈ గడిచిన 2010-2020 సమయంలో కొన్ని వేల సంఖ్యలో సినిమాలు వచ్చాయి. 

 

కానీ అందులో కొన్ని సినిమాలు మాత్రం ప్రపంచాన్ని అబ్బుర పరిచాయి. కొన్ని రావడం రావడమే బారి బడ్జెట్ సినిమాలు అయితే మరి కొన్ని బడ్జెట్ లేకపోయినా కొన్ని సినిమాలు సూపర్ కలెక్షన్స్ అందుకున్నాయి. అలాగే ప్రపంచం అంత మన తెలుగు సినిమాలను గుర్తించే విధంగా ఒరిజినల్ సినిమాలల పేర్లు తెచ్చుకున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి 2010లో మర్యాద రామన్న, 2012లో ఈగ, 2015లో బాహుబలి, 2017లో బాహుబలి 2 సినిమాలు తెరకెక్కించి ప్రపంచానికి మనం అంటే ఏంటో చూపించాడు రాజమౌళి. కొరటాల శివ దర్శకత్వంలో నాలుగు సినిమాలు ప్రపంచంలోనే ఎంతో ఆదరణ పొందాయి. అవి ఒకటి మహేష్ బాబు సినిమా శ్రీమంతుడు, భరత్ అనే నేను అయితే మరో సినిమా ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి. మరో అద్భుతమైన సినిమా ఎన్టీఆర్ హీరోగా జనతా గ్యారేజ్ సినిమా. 

 

ఇక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో 2010లో మహేష్ తో ఆయన తీసిన ఖలేజా, ఆ తరువాత 2012లో జులాయి, 2013లో అత్తారింటికి దారేది, 2015లో సన్ ఆఫ్ సత్యమూర్తి, 2016 లో అఆ, 2018లో అరవింద సమేత సినిమాలు అద్భుతంగా ఉన్నాయి. రాజమౌళి సినిమాలు ఒకసారి మాత్రమే చూడగలం.. కానీ త్రివిక్రమ్ సినిమాలు ఎన్నిసార్లు చుసిన ఇంకా ఇంకా చూడాలి అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంటాయి త్రివిక్రమ్ సినిమాలు. 


 
ఇంకా 2015లో పటాస్ చిత్రం, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2 వంటివి మంచి ఆదరణ పొందినవే. 2010లో రానా హీరోగా తెరకెక్కిన లీడర్ సినిమా, 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, 2017లో ఫిదా సినిమాలు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందాయి. 2010లో ఎన్టీఆర్ బృందావనం, రామ్ చరణ్ ఎవడు, నాగార్జున, కార్తీల ఊపిరి, 2019లో మహేష్ మహర్షి చిత్రం. ఇలా అన్ని సినిమాలు గత 10 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: