తెలుగు సినిమా ఇండస్ట్రీని మరియు భారతీయ చలనచిత్ర రంగ దమ్ము ఏంటో ప్రపంచ సినిమా రంగానికి తెలియజేసిన ఏకైక డైరెక్టర్ ఎవరైనా ఉన్నారంటే అది ఎస్.ఎస్.రాజమౌళి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎటువంటి పరాజయం లేని సినిమాలు తెరకెక్కించి అని సినిమా ఫార్మెట్ల ప్రేక్షకులను అలరించిన సినిమాలు తీస్తూ ఎక్కువగా మాస్ ఆడియన్స్ నీ ఆకట్టుకునే విధంగా రాజమౌళి సినిమాలు తెరకెక్కించి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర అనేక సూపర్ డూపర్ హిట్లు కొట్టడం జరిగింది. ఇదే తరుణంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో తెరకెక్కించిన 'బాహుబలి' తో ఒక్క తన కెరియర్ ని మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ రూపురేఖలతో పాటు భారతీయ చలనచిత్ర రూపురేఖలను కూడా మార్చేశాడు ఎస్.ఎస్.రాజమౌళి.

 

ఒకానొక సమయంలో భారతీయ చలన చిత్రం రంగం గురించి విదేశీయులు ప్రపంచ సినిమా ప్రేక్షకులు ప్రస్తావించిన సందర్భంలో బాలీవుడ్ గురించి మాట్లాడే వాళ్ళు. అయితే ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి సినిమాను తెరకెక్కించాడో ఆ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి అదిరిపోయే సూపర్ డూపర్ హిట్ కావడంతో అప్పటినుండి ప్రపంచ స్థాయిలో భారతీయ చలన చిత్ర రంగ ప్రస్తావన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు రాజమౌళి గురించి మాట్లాడుకుంటున్నారు ప్రస్తుతం. అంతగా బాహుబలి సినిమా తో ఫుల్ పాపులారిటీ సంపాదించారు రాజమౌళి.

 

దీంతో 2010 నుంచి 2020 సంవత్సరం వరకు ఎప్పుడైనా ఎవరైనా తెలుగు సినిమా రంగంలో ఉన్న హీరోలు హీరోయిన్లు నిర్మాతలు ఎవరైనా సినిమా ఫీల్డ్ గురించి మాట్లాడాల్సిన ప్రస్తావన వచ్చినప్పుడు ఖచ్చితంగా రా రాజు రాజమౌళి గురించి మాట్లాడాలసిందే. అంతగా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ నీ మరియు అదే విధంగా సినిమా ఫీల్డ్ లో ఉన్న అన్ని ఇండస్ట్రీకి చెందిన హీరో హీరోయిన్ లు అన్నీ ఇండస్ట్రీకి చెందిన నిర్మాతలు మరియు డైరెక్టర్లు భారతీయ చలన చిత్ర రారాజు రాజమౌళి అని చెప్పాల్సిందే. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: